పాదచారుల రక్షణకు స్మార్ట్‌ఫోన్‌ యాప్‌

రోడ్డు మీద పరధ్యానంగా నడవటం క్షేమం కాదు. ఎక్కడ్నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో తెలియదు. ముఖ్యంగా రోడ్డు దాటే చోట మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది.

Published : 17 May 2023 00:20 IST

రోడ్డు మీద పరధ్యానంగా నడవటం క్షేమం కాదు. ఎక్కడ్నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో తెలియదు. ముఖ్యంగా రోడ్డు దాటే చోట మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇప్పుడు చాలామంది చేతిలో ఫోన్లు పట్టుకొని, వాటిని చూస్తూ నడవటం ఎక్కువైంది. దీంతో ప్రమాదాల బారినపడే వారి సంఖ్యా పెరిగింది. ఎంతోమంది ప్రాణాలనూ కోల్పోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించటానికి యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా పరిశోధకులు వినూత్న స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను రూపొందించారు. దీని పేరు స్ట్రీట్‌బిట్‌. పాదచారుల రక్షణలో ఇది గొప్ప మార్పు తీసుకురాగలదని భావిస్తున్నారు. బ్లూటూత్‌ రేడియో ట్రాన్స్‌మిటర్‌ (బీకన్‌) సాయంతో పనిచేస్తుంది. ఈ బీకన్లను అమర్చిన మూల మలుపుల వద్దకు పాదచారులు వచ్చినప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు హెచ్చరిక సంకేతాలు పంపుతుంది. ఇలా రోడ్డు మీద దృష్టి సారించేలా చేస్తుంది. ప్రమాదాల నివారణకు తోడ్పడుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలతోనే దీన్ని వాడుకోవచ్చని, తాము రూపొందించిన టెంప్లేట్‌ను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకిది చవకైన మార్గంగా తోడ్పడగలదని ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని