ట్రూకాలర్‌తో కాల్ రికార్డింగ్
ఫోన్ చేసేవారి పేరును చూపించటంతో ఆకట్టుకున్న ట్రూకాలర్ కొత్తగా కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలు రెండింటిలోనూ ఇది పనిస్తుంది. కాకపోతే ట్రూకాలర్ ప్రీమియం చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం చాలా ఫోన్లు కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. కానీ కొన్ని స్మార్ట్‌ఫోన్లు దీనికి అనుమతించటం లేదు. ఇలాంటి ఫోన్లు గలవారికి ట్రూకాలర్ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని వాడుకోవటం తేలికే. ట్రూకాలర్ డైలర్‌లోనే రికార్డింగ్ బటన్ కనిపిస్తుంది. వేరే డైలర్‌ను వాడుతున్నట్టయితే కాల్ మాట్లాడుతున్నప్పుడు రికార్డింగ్ బటన్ తేలుతూ కనిపిస్తుంది. యాపిల్ షరతుల మూలంగా ఐఓఎస్ పరికరాల్లో దీన్ని వాడుకునే ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంటుంది. ఐఫోన్లలో కాల్ రికార్డింగ్‌ను యాక్టివేట్ చేసుకోవటానికి ట్రూకాలర్ కలిగుండటంతో పాటు రికార్డింగ్ లైన్ నంబరుకు డయల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం కాల్‌ను యాడ్ చేసి, ఈ రెండింటినీ మెర్జ్ చేస్తే రికార్డు అవుతుంది. కాల్ ముగిశాక రికార్డింగ్‌తో కూడిన ఫైల్ ఫోన్‌కు అందుతుంది. ఇన్‌కమింగ్ కాల్స్‌కూ ఇదే వర్తిస్తుంది. నిజానికి ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ట్రూకాలర్ 2018లోనే కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్‌తో కొన్ని చిక్కులు ఎదురవ్వటంతో విరమించుకుంది. ఇప్పుడు కొత్తగా మరోసారి ప్రవేశపెట్టింది. దీన్ని తొలిసారి అమెరికాలోని చందాదారులకే అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మనదేశానికీ విస్తరించాలని భావిస్తోంది. ట్రూకాలర్ కాల్ రికార్డింగ్ కోసం నెలకు రూ.79 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాదికైతే రూ.549 కట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి