టెక్‌ సమస్య రికార్డింగ్‌

టెక్‌ సమస్యలు సంక్లిష్టంగా ఉంటాయి. ఫోన్‌లో వాటిని వివరించటం కష్టం. అదే వీడియో తీసి పంపిస్తే తేలికగా అర్థమవుతుంది. ఇందుకోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మరే ప్రోగ్రామ్‌నూ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.

Published : 28 Jun 2023 00:20 IST
టెక్‌ సమస్యలు సంక్లిష్టంగా ఉంటాయి. ఫోన్‌లో వాటిని వివరించటం కష్టం. అదే వీడియో తీసి పంపిస్తే తేలికగా అర్థమవుతుంది. ఇందుకోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మరే ప్రోగ్రామ్‌నూ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. విండోస్‌ పీసీలోనే మంచి సదుపాయం ఉంది. దీని పేరు స్టెప్స్‌ రికార్డర్‌. ఇది ఉచితమే. ఉపయోగించటమూ తేలికే. ఇది పీసీ సమస్యకు సంబంధించిన అంశాలను అంచెలంచెలుగా స్క్రీన్‌షాట్స్‌ తీస్తుంది. వీటికి కామెంట్స్‌ను జోడించి టెక్నీషియన్‌కు పంపొచ్చు. దీంతో అవతలివారికి సమస్య గురించి స్పష్టంగా అవగతమవుతుంది. ఇది మిగతా స్క్రీన్‌ రికార్డర్ల వంటిది కాదు. ప్రత్యేకంగా సమస్యల పరిష్కారం కోసమే రూపొందించినది. ఇది తెర మీద వివరాలను మన చేసే పనులు దఫదఫాలుగా స్క్రీన్‌షాట్‌ రూపంలో రికార్డు చేస్తుందే తప్ప మాటలను కాదు. అవసరమనుకుంటే వ్యాఖ్యలను జోడించి వివరించొచ్చు. ఉదాహరణకు- ప్రోగ్రామ్‌ సమస్యను స్క్రీన్‌ రికార్డు చేసి ‘స్టార్ట్‌ బటన్‌ నొక్కినప్పుడు నా కంప్యూటర్‌ ఫ్రీజ్‌ అయ్యింది.’ అని వివరించొచ్చు. మరి స్టెప్స్‌ రికార్డర్‌ను వాడుకోవటమెలా?
  • సెర్చ్‌ బార్‌లో ‘విండోస్‌ స్టెప్స్‌ రికార్డర్‌’ అని టైప్‌ చేయాలి. యాప్‌ పాపప్‌ అవ్వగానే ఓపెన్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. విండోస్‌ 7 పీసీలోనైతే ‘ప్రాబ్లమ్స్‌ స్టెప్‌ రికార్డర్‌’ అని టైప్‌ చేయాలి.
  • యాప్‌ను ఆన్‌ చేయగానే స్టార్ట్‌ రికార్డ్‌, స్టాప్‌ అండ్‌ రివ్యూ, సెటింగ్స్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • స్టార్ట్‌ రికార్డు ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే రికార్డింగ్‌ మొదలవుతుంది. కర్సర్‌ ద్వారా ఎక్కడెక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్లాలి. అప్పుడు మొత్తమంతా స్క్రీన్‌షాట్ల రూపంలో రికార్డు అవుతుంది.
  • సమస్యను వివరించటం పూర్తయ్యాక స్టాప్‌ రికార్డు ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • చివర్లో స్లైడ్‌షోను రివ్యూ చేసి, సేవ్‌ చేసుకోవాలి.
  • ఆ ఫైలుకు పేరు పెట్టుకొని, ఎక్కడ సేవ్‌ కావాలో ఎంచుకొని తిరిగి సేవ్‌ బటన్‌ను నొక్కాలి. ఇది జిఫ్‌ రూపంలో సేవ్‌ అవుతుంది. దాన్ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి, టెక్నీషియన్‌కు పంపటమే తరువాయి.
  • దీని ద్వారా సమస్యలను వివరించుకోవటమే కాదు.. మిత్రులకు, తెలిసినవారికి టెక్‌ చిట్కాలనూ తెలియజేయొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని