థర్డ్ పార్టీ యాప్స్ లింక్ వద్దనుకుంటే?
నేటి డిజిటల్ యుగంలో సౌకర్యమే కీలకం. వివిధ వెబ్‌సైట్లు, యాప్స్‌ను వాడుకోవటానికి అంతా తేలికైన మార్గాలనే ఎంచుకుంటారు. వీటి సేవలను పొందటానికి చాలామంది చేసే పని గూగుల్ ఖాతాతో సైన్ అప్ కావటం. అయితే కొన్నిసార్లు ఇది హానికరంగా పరిణమించొచ్చు.
నేటి డిజిటల్ యుగంలో సౌకర్యమే కీలకం. వివిధ వెబ్‌సైట్లు, యాప్స్‌ను వాడుకోవటానికి అంతా తేలికైన మార్గాలనే ఎంచుకుంటారు. వీటి సేవలను పొందటానికి చాలామంది చేసే పని గూగుల్ ఖాతాతో సైన్ అప్ కావటం. అయితే కొన్నిసార్లు ఇది హానికరంగా పరిణమించొచ్చు. కాబట్టి తరచూ సమీక్షించుకొని, అనవసర యాప్స్‌ను తొలగించుకోవటం మంచిది. దీంతో ఆన్‌లైన్ భద్రత మెరుగవుతుంది. మరి గూగుల్ ఖాతాతో అనుసంధానమైన అవాంఛిత యాప్‌లను తొలగించుకోవటమెలా?
- ముందుగా ఆండ్రాయిడ్ పరికరంలో గూగుల్ యాప్ మీద క్లిక్ చేయాలి.
- అప్పుడు మెనూలో గూగుల్ ఖాతాకు సంబంధించిన ఆప్షన్లు, సెటింగ్స్ కనిపిస్తాయి.
- ‘మేనేజ్ గూగుల్ అకౌంట్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అకౌంట్ మేనేజ్‌మెంట్ విభాగం ద్వారా ‘సెక్యూరిటీ’ ఫీచర్ మీద నొక్కాలి.
- ఇందులోని ‘థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్’ విభాగంలో గూగుల్ ఖాతాతో అనుసంధానమై యాప్‌లన్నీ కనిపిస్తాయి.
- ఈ జాబితాను జాగ్రత్తగా పరిశీలించి, అనవసరమైన యాప్‌లను అన్‌లింక్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి