Chatgpt: ఆండ్రాయిడ్‌లోనూ ఛాట్‌జీపీటీ యాప్‌

కృత్రిమ మేధతో కూడిన ఛాట్‌బాట్‌ ఛాట్‌జీపీటీ యాప్‌ రోజురోజుకీ ప్రాచుర్యం, ఆదరణ పొందుతోంది. దీన్ని ఇకపై మనమూ ఆండ్రాయిడ్‌ పరికరాల్లోనూ వాడుకోవచ్చు.

Updated : 02 Aug 2023 07:33 IST

కృత్రిమ మేధతో కూడిన ఛాట్‌బాట్‌ ఛాట్‌జీపీటీ యాప్‌ రోజురోజుకీ ప్రాచుర్యం, ఆదరణ పొందుతోంది. దీన్ని ఇకపై మనమూ ఆండ్రాయిడ్‌ పరికరాల్లోనూ వాడుకోవచ్చు. భారత్‌తో పాటు అమెరికా, బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌ దేశాల్లో ఆండ్రాయిడ్‌ పరికరాల్లో ఛాట్‌జీపీటీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓపెన్‌ ఏఐ సంస్థ ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లో మరిన్ని దేశాలకూ దీన్ని విస్తరించనుంది. ఈ యాప్‌ వివిధ పరికరాల హిస్టరీతో సింక్‌ అవుతుంది. ఓపెన్‌ ఏఐ వెలువరించే తాజా మోడల్‌ మార్పులతో కూడి ఉంటుంది. గత వారం ఓపెన్‌ ఏఐ సంస్థ ఛాట్‌జీపీటీ కోసం ‘కస్టమైజ్డ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌’ ఫీచర్‌నూ ప్రవేశపెట్టింది. ఇది మున్ముందు సంభాషణల కోసం దేనినైనా ఛాట్‌జీపీటీతో షేర్‌ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం బీటా ప్లస్‌ యూజర్లకే అందుబాటులో ఉన్న దీన్ని త్వరలో అందరికీ అందుబాటులోకి తేనున్నారు. వినియోగదారులు తమ ఓపెన్‌ఏఐ ఖాతాలను డిలీట్‌ చేసినప్పుడు వారి ఖాతాలతో అనుసంధానమైన కస్టమ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ కూడా 30 రోజుల వ్యవధిలో కనుమరుగవుతాయి. ఐఓఎస్‌ పరికరాలు వాడేవారు ఛాట్‌జీపీటీ అకౌంట్‌ సెటింగ్స్‌ ద్వారా కస్టమ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. వెబ్‌ పేజీలోనైతే మన పేరు మీద తాకి, కస్టమ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఎంటర్‌ చేసి ‘షో టిప్స్‌’ మీద క్లిక్‌ చేస్తే వాటికి సంబంధించిన ఉదాహరణలు కనిపిస్తాయి. వీటిని ఎంచుకొని, సేవ్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని