ఆన్‌లైన్‌ గోప్యత మరింత భద్రంగా..

వ్యక్తిగత సమాచారం, గోప్యత, ఆన్‌లైన్‌ భద్రతను కాపాడుకోవటానికి గూగుల్‌ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

Published : 09 Aug 2023 00:01 IST

వ్యక్తిగత సమాచారం, గోప్యత, ఆన్‌లైన్‌ భద్రతను కాపాడుకోవటానికి గూగుల్‌ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. మనం సొంత అవసరాలకు వాడుకునే ఫోన్‌ నంబరు ఆన్‌లైన్‌లో ఎక్కడైనా కనిపించినప్పుడు అప్రమత్తం చేసే ఫీచర్‌ కూడా ఇందులో ఉంది. వ్యక్తిగత ఫోన్‌ నంబరు, ఇంటి చిరునామా, ఈమెయిల్‌తో కూడిన సెర్చ్‌ ఫలితాలను తొలగించాలని విన్నవించటానికి గూగుల్‌ గత సంవత్సరమే ‘రిజల్ట్స్‌ అబౌట్‌ యు’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని గణనీయంగా మెరుగుదిద్దింది. సెర్చ్‌ ఫలితాల్లో మన కాంటాక్టు సమాచారం కనిపించినప్పుడు అప్రమత్తం చేసేలా తీర్చిదిద్దింది. దీని ద్వారా వెంటనే ఫలితాల నుంచి సమాచారాన్ని తొలగించు కోవటానికి వీలవుతుంది. ఇందుకోసం గూగుల్‌ యాప్‌ నుంచే నేరుగా వినతిని పంపించొచ్చు. నీలి చిత్రాలు, హింసాత్మక దృశ్యాల వంటివి వాటంతటవే మసక బారేలా చేసే కొత్త ఫీచర్‌నూ గూగుల్‌ పరిచయం చేసింది. దీనికి సంబంధించిన సెటింగ్‌ను ఈ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తేనుంది. సెర్చ్‌లోనే పేరెంటల్‌ కంట్రోల్స్‌ను తేలికగా గుర్తించే సదుపాయాన్నీ తీసుకొస్తోంది. గూగుల్‌ పేరెంటల్‌ కంట్రోల్స్‌ లేదా గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌ అని సెర్చ్‌ బాక్స్‌లో టైప్‌ చేస్తే చాలు. తమ పేరెంటల్‌ కంట్రోల్స్‌ను నిర్వహించుకోవటానికి సంబంధించిన సమాచారంతో కూడిన బాక్స్‌ కనిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని