గంపగుత్త అన్‌ఇన్‌స్టాల్‌

యాప్స్‌, గేమ్స్‌ ఇన్‌స్టాల్‌ చేయటం తేలికే. కానీ అన్నీ వాడతామా అన్నది సందేహమే. ఇలాంటివి ఫోన్‌ స్టోరేజీని ఆక్రమిస్తాయి. బ్యాటరీనీ ఖాళీ చేస్తాయి. కాబట్టి వాడని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవటమే మేలు

Updated : 20 Sep 2023 22:19 IST

యాప్స్‌, గేమ్స్‌ ఇన్‌స్టాల్‌ చేయటం తేలికే. కానీ అన్నీ వాడతామా అన్నది సందేహమే. ఇలాంటివి ఫోన్‌ స్టోరేజీని ఆక్రమిస్తాయి. బ్యాటరీనీ ఖాళీ చేస్తాయి. కాబట్టి వాడని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవటమే మేలు. ఒకేసారి చాలా యాప్స్‌ను తొలగించు కోవటానికి రూటింగ్‌ లేదా ఇతర సంక్లిష్ట పద్ధతులను వాడుతుంటారు. అంత కష్టపడక్కర్లేదు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఒకేసారి చాలా అప్లికేషన్లను తొలగించటానికి ప్లేస్టోర్‌లో తేలికైన మార్గముంది.

  •  ముందు ప్లేస్టోర్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, పైన కుడివైపున ఉండే ప్రొఫైల్‌ ఫొటో మీద తాకాలి. తర్వాత ‘మేనేజ్‌ యాప్స్‌ అండ్‌ డివైసెస్‌’ను ఎంచుకోవాలి. అప్పుడు ఎంత స్టోరేజీని వాడుతున్నామో తెలిపే విభాగం కనిపిస్తుంది. దీని మీద ట్యాప్‌ చేయగానే ప్లేస్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకున్న యాప్స్‌ జాబితా ప్రత్యక్షమవుతుంది.  
  • అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవాలనుకునే యాప్స్‌ పక్క బాక్సును ఎంచుకొని, పైన కుడివైపున ట్రాష్‌ గుర్తును తాకాలి. అన్‌ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌ ప్రత్యక్షమవుతుంది. దీని మీద నొక్కగానే అన్ని యాప్స్‌ గంపగుత్తగా పోతాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని