మెసేజెస్‌ నుంచే ఫొటో షేర్‌

ఫోన్‌లో ఎవరికైనా ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయాలంటే ముందు గ్యాలరీలోకి వెళ్తాం. వాటిని గుర్తించాక కాంటాక్టులను వెతికి షేర్‌ చేస్తుంటాం. ఐఫోన్‌ వాడేవారైతే మరింత త్వరగా మెసేజెస్‌ ద్వారానే దీన్ని కానియ్యొచ్చు

Published : 28 Feb 2024 00:08 IST

ఫోన్‌లో ఎవరికైనా ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయాలంటే ముందు గ్యాలరీలోకి వెళ్తాం. వాటిని గుర్తించాక కాంటాక్టులను వెతికి షేర్‌ చేస్తుంటాం. ఐఫోన్‌ వాడేవారైతే మరింత త్వరగా మెసేజెస్‌ ద్వారానే దీన్ని కానియ్యొచ్చు. అయితే ముందుగా ఫోన్‌ను ఐఓఎస్‌17కు అప్‌డేట్‌ చేసుకోవాలి మరి. మెసేజెస్‌ను ఓపెన్‌ చేసి, ఎవరికి ఫొటో పంపించాలని అనుకుంటున్నారో వారి కాంటాక్టు నంబరును ఎంచుకోవాలి. అనంతరం ప్లస్‌ గుర్తు మీద నొక్కి, అలాగే అదమాలి. అప్పుడు ఫొటో గ్యాలరీ కనిపిస్తుంది. ఇందులో ఫొటో లేదా వీడియోను ఎంచుకొని, అక్కడి నుంచే సెండ్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని