విండోస్‌లోనూ ఏఐ ఎరేజ్‌

గూగుల్‌, సామ్‌సంగ్‌ పరికరాల్లో ఏఐ ఆధారిత ఫొటో ఎరేజర్‌ గురించి వినే ఉంటారు. వీటి జాబితాల్లోకి ఇప్పుడు విండోస్‌ పీసీలనూ చేర్చుకోండి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ తాజాగా జనరేటివ్‌ ఎరేజ్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది.

Published : 06 Mar 2024 00:57 IST

గూగుల్‌, సామ్‌సంగ్‌ పరికరాల్లో ఏఐ ఆధారిత ఫొటో ఎరేజర్‌ గురించి వినే ఉంటారు. వీటి జాబితాల్లోకి ఇప్పుడు విండోస్‌ పీసీలనూ చేర్చుకోండి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ తాజాగా జనరేటివ్‌ ఎరేజ్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. విండోస్‌ పీసీల్లో బిల్టిన్‌గా ఉండే ఫొటోస్‌ అప్లికేషన్‌కు ఈ ఫీచర్‌ తోడవనుంది. ఇది ఫొటోల్లో అనవసర దృశ్యాలను తొలగించుకోవటానికి తోడ్పడుతుంది. దీంతో వెనకాల ఉండే దృశ్యాల వంటి వాటిని సరి చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వస్తువులను, దృశ్యాలను చెరిపేసినా అది సహజమే అనిపించేలా చేయటం దీని ప్రత్యేకత. ఫొటోస్‌ యాప్‌ లోని ఎడిట్‌ ఇమేజ్‌ ద్వారా ఎరేజ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి జనరేటివ్‌ ఎరేజ్‌ను ఎంచుకోవచ్చు. అనంతరం తొలగించుకోవాల్సిన వస్తువులు, భాగం మీద బ్రష్‌ను కదిపితే చాలు. అవి మాయమవుతాయి. చుట్టుపక్కలున్న దృశ్యం అక్కడికి వచ్చి చేరుతుంది. ఇప్పటివరకూ విండోస్‌ 11కే పరిమితమైన ఫొటోస్‌ యాప్‌ ఏఐ ఫీచర్లను తొలిసారిగా విండోస్‌ 10 పరికరాలకూ అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని