ఫ్లాష్‌ నోటిఫికేషన్లు ఇలా..

ఫోన్‌ సైలెంట్‌లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్‌ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్‌ లైట్‌ అలర్ట్‌ను సెట్‌ చేసుకుంటే చాలు.

Published : 06 Mar 2024 01:09 IST

ఫోన్‌ సైలెంట్‌లో పెట్టారు. కానీ ముఖ్యమైన నోటిఫికేషన్లు మిస్‌ అవుతున్నామేమో అని మనసులో అనిపిస్తుంటుంది. అంతలా బాధపడాల్సిన పనిలేకుండా ఫ్లాష్‌ లైట్‌ అలర్ట్‌ను సెట్‌ చేసుకుంటే చాలు.

  •  ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో- సెటింగ్స్‌ ద్వారా నోటిఫికేషన్స్‌లోకి వెళ్తే ఫ్లాష్‌ నోటిఫికేషన్‌ కనిపిస్తుంది. ఇందులో కెమెరా ఫ్లాష్‌ లేదా స్క్రీన్‌ ఫ్లాష్‌ను ఎంచుకోవాలి. స్క్రీన్‌ ఫ్లాష్‌ ఫీచర్‌తో ఫ్లాష్‌ రంగునూ మార్చుకోవచ్చు. యాక్సెసబిలిటీ విభాగంలోని ఫ్లాష్‌ నోటిఫికేషన్స్‌లోనూ ఫ్లాష్‌ నోటిఫికేషన్స్‌ సెటింగ్స్‌ కనిపిస్తాయి. కెమెరా ఫ్లాష్‌ గానీ స్క్రీన్‌ ఫ్లాష్‌ గానీ.. లేదూ ఈ రెండింటినైనా ఎంచుకోవచ్చు. ఎందుకంటే అన్ని పరికరాల్లో కెమెరా ఫ్లాష్‌ ఉండకపోవచ్చు. ఫ్లాష్‌ లైట్‌ అలర్ట్‌ను సెట్‌ చేసుకుంటే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ వచ్చినప్పుడు జవాబు ఇచ్చేవరకూ లైట్‌ ఫ్లాష్‌ అవుతూనే ఉంటుంది. మెసేజ్‌లు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు కాంతి మినుకు మినుకుమని మెరుస్తూ ఉంటుంది.
  •  ఐఫోన్‌లో- సెటింగ్స్‌ ద్వారా యాక్సెసబిలిటీలోకి వెళ్లాలి. అనంతరం ఆడియో అండ్‌ విజువల్‌ ద్వారా ఎల్‌ఈడీ ఫ్లాష్‌ ఫర్‌ అలర్ట్స్‌ ఎంచుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని