డాక్స్‌లో పాత వర్షన్‌ కావాలంటే?

గూగుల్‌ డాక్స్‌లో ఎడిటింగ్‌ చేస్తూనే ఉంటాం. షేర్‌ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు.

Updated : 13 Mar 2024 04:19 IST

గూగుల్‌ డాక్స్‌లో ఎడిటింగ్‌ చేస్తూనే ఉంటాం. షేర్‌ చేసిన ఫైళ్లలో ఎవరెవరో ఏవో మార్పులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ముందరి డాక్యుమెంట్‌లోని సమాచారమే బాగుందని అనిపించొచ్చు. ఇలాంటి సమయంలోనే వర్షన్‌ హిస్టరీ ఫీచర్‌ తోడుంటుంది. దీంతో మార్పులను సమీక్షించుకోవచ్చు. డిలీట్‌ చేసిన పేరాను తిరిగి తెచ్చుకోవచ్చు. కావాలంటే మొత్తం డాక్యుమెంటును మునుపటిలా మార్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఫైల్‌ మెనూలోకి వెళ్లి వర్షన్‌ హిస్టరీ ఫీచర్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇందులో వర్షన్‌ హిస్టరీ కనిపిస్తుంది. కుడివైపున కనిపించే టైమ్‌ మీద క్లిక్‌ చేస్తే అప్పటి డాక్యుమెంట్‌ ప్రత్యక్షమవుతుంది. అవసరమైన మార్పులు చేసుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని