గూగుల్‌ లెన్స్‌లో సెర్చ్‌ హిస్టరీ సేవ్‌

గూగుల్‌ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated : 13 Mar 2024 04:13 IST

గూగుల్‌ లెన్స్‌తో ఇమేజ్‌లను వెతికేవారికి శుభవార్త. ఇకపై వెతికిన ఇమేజ్‌లను తేలికగా తెలుసుకోవచ్చు. అవసరమైతే అక్కడి నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం విజువల్‌ సెర్చ్‌ హిస్టరీని సేవ్‌ చేసే ఫీచర్‌ను గూగుల్‌ పరిచయం చేసింది. ఇప్పటివరకూ గూగుల్‌ లెన్స్‌ యాప్‌లోని షటర్‌ బటన్‌తో తీసిన ఫొటోలు విశ్లేషణ కోసం గూగుల్‌కు చేరుకొని, తర్వాత అదృశ్యమవుతాయి. అంటే పరికరంలో ఆ ఫొటోలు సేవయ్యే అవకాశం లేదన్నమాట. అందుకే కొందరు కెమెరా యాప్‌తో ఫొటో తీసి, తర్వాత యాప్‌ విశ్లేషణకు ఉపయోగిస్తుంటారు. తాజా ఫీచర్‌తో ఇలాంటి ఇబ్బంది తప్పుతుంది. లెన్స్‌తో తీసిన ఫొటో దానంతటదే సేవ్‌ అవుతుంది. అయితే దీన్ని గూగుల్‌ యాప్‌లో లెన్స్‌లో మాత్రమే వాడుకోవటానికి వీలుంటుంది. గూగుల్‌ ఫొటోస్‌ ఇంటిగ్రేషన్‌ లేదా సర్కిల్‌ టు సెర్చ్‌ వంటి వాటిలో వాడుకోవటం కుదరదు. విజువల్‌ సెర్చ్‌ హిస్టరీని చూడాలంటే.. ముందుగా మైయాక్టివిటీ.గూగుల్‌.కామ్‌లోకి వెళ్లాలి. గూగుల్‌ లెన్స్‌తో వెతికిన ఇమేజ్‌లన్నీ అక్కడి పేజీలో కనిపిస్తాయి. వీటిని తర్వాత ఎప్పుడైనా వాడుకోవటానికి డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫీచర్‌ డిఫాల్ట్‌గా డిసేబుల్‌ అయ్యింటుంది. కాబట్టి ఎనేబుల్‌ చేసుకోవాలి. మైయాక్టివిటీ.గూగుల్‌.కామ్‌లోకి వెళ్లి డేటా అండ్‌ ప్రైవసీ మీద క్లిక్‌ చేయాలి. తర్వాత వెబ్‌ అండ్‌ యాప్‌ యాక్టివిటీ మీద నొక్కి ‘ఇన్‌క్లూడ్‌ విజువల్‌ సెర్చ్‌ హిస్టరీ’ బటన్‌ను ఆన్‌ చేసు కోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని