ఏఐ పాట

కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్‌ జనరేటర్‌ వేదిక.

Published : 20 Mar 2024 00:27 IST

కృత్రిమమేధ (ఏఐ) సాయంతో కొత్త పాటలను సృష్టించాలని అనుకుంటున్నారా? అయితే సునో ఏఐ (https://www.suno.ai/) సాయం తీసుకోండి. ఇదో ఏఐ మ్యూజిక్‌ జనరేటర్‌ వేదిక. ఎలాంటి పాట కావాలని భావిస్తున్నారో దాన్ని పదాలతో వర్ణించి చెబితే చాలు. చిటికెలో 15 సెకండ్ల నిడివి గల పాటలను ముందుంచుతుంది. పాట శీర్షికనూ నిర్ణయిస్తుంది. వెబ్‌ ఇంటర్ఫేస్‌తోనే ఇందులో పాటలు సృష్టించుకోవచ్చు. కాకపోతే నిజం కళాకారుల గొంతులతో ఇది పాటలను సృష్టించదు. దీనిలో లాగిన్‌ అయ్యి ఉచితంగా వాడుకోవచ్చు. అయితే ఉచిత యూజర్లు తమ మ్యూజిక్‌ ట్రాక్స్‌ను అమ్ముకోవటానికి కుదరదు. ఇందుకోసం చందా కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రొ, ప్రీమియర్‌ చందాలు అందుబాటులో ఉన్నాయి. చవక ప్రొ చందా నెలకు రూ.830తో మొదలవుతుంది. గత సంవత్సరం ఆరంభమైన సునో ఏఐ వేదిక మైక్రోసాఫ్ట్‌తోనూ జట్టుకట్టింది. కోపైలట్‌లో ఎక్స్‌టెన్షన్‌ రూపంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ ఛాట్‌బాట్‌తోనూ సునోను ఉపయోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని