వాట్సప్‌లో మరిన్ని మెసేజ్‌లు పిన్‌

వాట్సప్‌ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్‌, మెసేజ్‌లను పిన్‌ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్‌ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది.

Published : 20 Mar 2024 01:11 IST

వాట్సప్‌ ప్రియులకు శుభవార్త. ఇకపై ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్‌, మెసేజ్‌లను పిన్‌ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లలో భాగంగా వాట్సప్‌ దీన్ని ఇటీవలే పరిచయం చేసింది. ప్రస్తుతానికి 2.24.6.15 లేదా అంతకన్నా తర్వాతి వాట్సప్‌ వర్షన్లు గల కొందరికిది అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమైన ఛాట్స్‌, మెసేజ్‌లకు ప్రాధాన్యం ఇవ్వటానికి, వాటిని అన్నింటికన్నా పైన కనిపించేలా చూసుకోవటానికిది తోడ్పడుతుంది. తాజా వాట్సప్‌ బీటా వర్షన్‌ అందుబాటులో గలవారు ఈ ఫీచర్‌ ద్వారా ఒక్కో ఛాట్‌కు మూడు వరకూ మెసేజ్‌ల చొప్పున.. ఐదు ఛాట్స్‌ను పిన్‌ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ తరచూ వాట్సప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసి పొందొచ్చు. వాట్సప్‌లో మెసేజ్‌ను పిన్‌ చేసుకోవాలంటే- ఛాట్‌ను ఓపెన్‌ చేసి, పిన్‌ చేసుకోవాలనుకునే మెసేజ్‌ను ఎంచుకోవాలి. ఛాట్‌ పైభాగాన కనిపించే పిన్‌ గుర్తు మీద క్లిక్‌ చేస్తే 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు అనే ఆప్షన్లు ప్రత్యక్షమవుతాయి. అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి. ఒకవేళ పిన్‌ చేసిన మెసేజ్‌ను వద్దనుకుంటే- దాని మీద క్లిక్‌ చేసి, అన్‌పిన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది యాప్‌లోనే కాదు, వెబ్‌ వర్షన్‌లోనూ పనిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని