ఏఐ వీడియోకు సౌండ్‌ ట్రాక్‌ సొబగులూ

ఏఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి.

Published : 27 Mar 2024 00:05 IST

ఐతో వీడియోలు సృష్టించటం తేలికైపోయింది. ఎలాంటి వీడియో కావాలో పదాల్లో వర్ణిస్తే చాలు. దానికి తగ్గట్టుగా వీడియోలు రూపొందించే ఏఐ వేదికలు చాలానే ఉన్నాయి. మరి వాటికి సరిపోయే ఆడియో కావాలంటే? పికా ల్యాబ్స్‌ను వాడుకోవచ్చు. ఇది వీడియోను సృష్టించటమే కాదు.. ఎలాంటి సౌండ్‌ ఎఫెక్ట్‌ కావాలో వర్ణిస్తే అలాంటి ఆడియోను వీడియోకు జతచేస్తుంది కూడా. ఉదాహరణకు- ఇంట్లో వంట చేసే వీడియోను సృష్టించేటప్పుడు కూరగాయలు కోస్తున్నప్పుడు, గరిటెతో తిప్పుతున్నప్పుడు వచ్చే శబ్దాలను జత చేయమని చెబితే చాలు. వీడియోకు వాటిని కూడా యాడ్‌ చేసేస్తుంది. ఎలాంటి శబ్దాలు అవసరమో నిర్ణయించుకోలేకపోతే సౌండ్‌ ఎఫెక్ట్స్‌ను వెతికే ఫీచర్‌ కూడా ఇందులో ఉంటుంది. దీన్ని వాడుకోవాలంటే నెలకు రూ.663 చందా కట్టాల్సి ఉంటుంది. మరిన్ని సమగ్రమైన ఫీచర్లు అవసరమనుకునేవారు నెలకు రూ.4,808 చందా తీసుకోవచ్చు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని