వాట్సప్‌ కొత్త ఇమేజ్‌ ఎడిటర్‌

వాట్సప్‌ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్‌ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్‌ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ ఇమేజ్‌లను షేర్‌ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు.

Published : 27 Mar 2024 00:08 IST

వాట్సప్‌ త్వరలో ఏఐ ఆధారిత కొత్త ఇమేజ్‌ టూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ఫొటోలను తేలికగా ఎడిట్‌ చేసుకోవటానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ ఇమేజ్‌లను షేర్‌ చేసుకునే పేజీలో పైన కనిపిస్తుందని చెబుతున్నారు. ఇందులో ఎక్స్‌పాండ్‌, రిఫైన్‌, బ్యాక్‌డ్రాప్‌ వంటి సదుపాయాలూ ఉంటాయి. వీటితో నేపథ్య దృశ్యాలను మార్చుకోవచ్చు. స్టైళ్లను మెరుగు పరచుకోవచ్చు. ఇమేజ్‌ కొలతలను మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉంది. ముందుగా బీటా వర్షన్‌ను విడుదల చేయనున్నారు.

‘ఆస్క్‌ మెటా’ అనే మరో ఫీచర్‌నూ వాట్సప్‌ ప్రవేశపెట్టనుంది. దీని సాయంతో యాప్‌ పైన ఉండే సెర్చ్‌ బార్‌ ద్వారా మెటా ఏఐకి ప్రశ్నలు సంధించొచ్చు. అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని