నిర్ణీత సమయానికి ఎస్‌ఎంఎస్‌

ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్‌ఎంఎస్‌ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది.

Published : 10 Apr 2024 00:30 IST

ఆత్మీయుల పుట్టినరోజు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఎస్‌ఎంఎస్‌ పంపించాలని అనుకుంటాం. కానీ అప్పటివరకూ మెలకువగా ఉండకపోతే? నిద్రపోయినప్పుడు ఆ సమయానికి మెలకువ రాకపోతే? ఇలాంటి సమయాల్లోనే నిర్ణీత సమయానికి మెసేజ్‌లు అందే సదుపాయం ఉంటే బాగుండునని అనిపిస్తుంటుంది. ఈమెయిల్‌లో ఇలాంటి అవకాశం లేకపోలేదు. తేదీ, టైమ్‌ ఎంచుకుంటే సరిగ్గా ఆ సమయానికి అవతలి వారికి మెయిల్‌ సందేశం చేరుతుంది. కానీ ఫోన్లతోనే ఇబ్బంది. కానీ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ ఉంటే మాత్రం తేలికే. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని, డిఫాల్ట్‌ ఎస్‌ఎంఎస్‌ యాప్‌గా సెట్‌ చేసుకుంటే చాలు. ఆయా సమయాల మేరకు సందేశం పంపొచ్చు.

  • గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అప్పటికే ఆయా వ్యక్తులతో సంప్రదింపులు జరిపినట్టయితే స్టార్ట్‌ ఛాట్‌ మీద నొక్కాలి. లేకపోతే జాబితాలోంచి కన్వర్జేషన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
  •  కొత్తగా కన్వర్జేషన్‌ మొదలెడుతున్నట్టయితే పేరు లేదా ఫోన్‌ నంబరును టైప్‌ చేసి, కాంటాక్టు జాబితా నుంచి ఎస్‌ఎంఎస్‌ పంపాలనుకునే వారిని ఎంచుకోవాలి.
  •  కన్వర్జేషన్‌ బాక్సు మీద క్లిక్‌ చేసి సందేశాన్ని టైప్‌ చేయాలి. సందేశం నిర్ణీత సమయానికి అవతలివారికి అందాలనుకుంటే బాక్సు పక్కన కనిపించే ప్లస్‌ గుర్తును క్లిక్‌ చేయాలి. లేదూ సెండ్‌ బటన్‌ను కాసేపు అలాగే అదిమి పట్టాలి. అప్పుడు షెడ్యూల్డ్‌ సెండ్‌ అప్షన్‌ కనిపిస్తుంది.
  •  ఇందులో డిఫాల్ట్‌గా కొన్ని సమయాలు కనిపిస్తాయి. అవసరాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవచ్చు. జాబితాలో లేని సమయానికి సందేశం పంపాలంటే ‘పిక్‌ డేట్‌ అండ్‌ టైమ్‌’ మీద క్లిక్‌ చేయాలి.
  •  క్యాలెండర్‌లో కనిపించే తేదీ, సమయాన్ని ఎంచుకొని సెట్‌ బటన్‌ను నొక్కాలి. అప్పుడు టైప్‌ చేసిన సందేశం, నిర్ణయించుకున్న తేదీ, సమయం కనిపిస్తాయి. అనంతరం సెండ్‌ గుర్తును నొక్కితే ఆ మెసేజ్‌ ఎంచుకున్న వ్యక్తి ఛాట్‌కు యాడ్‌ అవుతుంది. దాని పక్కన షెడ్యూల్డ్‌ గుర్తు కూడా కనిపిస్తుంది. ఆ సమయానికి అవతలివారికి అందుతుంది. అనంతరం అది మామూలు ఎస్‌ఎంఎస్‌ మాదిరిగానే ఉంటుంది. ఏ రోజున, ఎప్పుడు అందిందో అనే వివరాలు కనిపిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని