పాటలు నేర్పే పదనిస

హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది.

Published : 17 Apr 2024 00:17 IST

హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ పరిజ్ఞానంతో కూడిన దీన్ని భారతీయులను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ఇది వ్యక్తిగత సంగీతం మాస్టారుగా ఉపయోగడుతుంది. శ్రుతి, లయ బద్ధంగా పాడేలా శిక్షణ ఇస్తుంది. ఆయా వ్యక్తుల అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా పాఠాలను సూచించటం దీని ప్రత్యేకత. మెషిన్‌ లెర్నింగ్‌, అధునాతన ఆల్గోరిథమ్‌ల సాయంతో సాధిస్తున్న నైపుణ్యాలను గుర్తించి.. ఆ మేరకు పాఠాలనూ సరి దిద్దుతుంది. ఇదులో లైవ్‌ మాస్టర్‌ ఫీచర్‌ కూడా ఉంది. దీని ద్వారా నిపుణులతో ప్రత్యక్షంగా సంగీతాన్ని నేర్చుకోవచ్చు. సంగీతం గురించి లోతుగా అర్థం చేసుకోవచ్చు. ప్రశ్న-జవాబుల సెషన్‌లో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పాటల పాడుతూ వీడియో తీసి ఇతరులకూ పంపొచ్చు. వర్ధమాన గాయకులకు ఇదెంతో అనువుగా ఉంటుంది. సరిగమ నిర్వహించే టాలెంట్‌ హంట్‌ ప్రోగ్రామ్‌ కింద పాడటం కోసం ప్రత్యేకంగా మ్యూజిక్‌ లేబుల్‌ ఉండటం మరో విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని