వెబ్‌లోనూ ట్రూకాలర్‌

స్మార్ట్‌ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్‌ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్‌ బ్రౌజర్‌ రూపంలోకీ మారింది.

Published : 24 Apr 2024 00:13 IST

స్మార్ట్‌ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్‌ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్‌ బ్రౌజర్‌ రూపంలోకీ మారింది. ఆండ్రాయిడ్‌ పరికరాలు వాడేవారికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇన్‌కమింగ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌ వంటివన్నీ వెబ్‌ వర్షన్‌లోనూ కనిపిస్తాయి. మరి ఆండ్రాయిడ్‌ పరికరాలను ట్రూకాలర్‌ వెబ్‌ వర్షన్‌కు ఎలా కనెక్ట్‌ చేసుకోవాలి?

  • ముందు స్మార్ట్‌ఫోన్‌లో ట్రూకాలర్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • మెసేజెస్‌లోకి వెళ్లి, మూడు చుక్కల మీద తాకాలి.
  • మెనూలో ‘ట్రూకాలర్‌ ఫర్‌ వెబ్‌’ను ఎంచుకోవాలి.
  • ‘లింక్‌ డివైస్‌’ మీద తాకితే స్కానర్‌ ప్రత్యక్షమవుతుంది.
  • ఇప్పుడు డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి https://web.truecaller.com/ linkdevice వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.
  • అంతే. స్మార్ట్‌ఫోన్‌, ట్రూకాలర్‌ ఫర్‌ వెబ్‌ కనెక్ట్‌ అవుతాయి. అయితే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ పీసీకి దగ్గరగా ఉంటేనే అలర్ట్స్‌ అందుతాయని తెలుసుకోవాలి. వాట్సప్‌ వెబ్‌, టెలిగ్రామ్‌ వెబ్‌ మాదిరిగానే ఇదీ పనిచేస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని