మైక్రోసాఫ్ట్‌ 2ఎఫ్‌ఏ ఎలా?

మైక్రోసాఫ్ట్‌ ఖాతాను మరింత సురక్షితం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే టూఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను (2ఎఫ్‌ఏ) సెట్‌ చేసుకోండి. రోజురోజుకీ హ్యాకింగ్‌ పద్ధతులు తెలివి మీరుతున్న నేపథ్యంలో ఇది తప్పనిసరి.

Published : 01 May 2024 00:03 IST

మైక్రోసాఫ్ట్‌ ఖాతాను మరింత సురక్షితం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే టూఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను (2ఎఫ్‌ఏ) సెట్‌ చేసుకోండి. రోజురోజుకీ హ్యాకింగ్‌ పద్ధతులు తెలివి మీరుతున్న నేపథ్యంలో ఇది తప్పనిసరి. ఒకవేళ పాస్ట్‌వర్డ్‌ ఎవరైనా దొంగిలించినా ఖాతాను కాపాడుకోవటానికిది తోడ్పడుతుంది. విశ్వసనీయ పరికరానికి అందే కోడ్‌ను ఎంటర్‌ చేస్తే తప్ప ఖాతాను చూడలేం మరి. మైక్రోసాఫ్ట్‌ ఖాతాల్లో 2ఎఫ్‌ఏ కాస్త భిన్నంగానూ ఉంటుంది. ఏదో ఫోన్‌కో, ఈమెయిల్‌కో కోడ్‌ పంపటం కన్నా ప్రత్యేక యాప్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. అదే మైక్రోసాఫ్ట్‌ అథెంటికేటర్‌ యాప్‌. దీన్ని నమోదిత ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని, 2ఎఫ్‌ఏను సెట్‌ చేసుకోవాలి. ఇదెలాగో చూద్దాం.

  • ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ లేదా గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మైక్రోసాఫ్ట్‌ అథెంటికేటర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  • యాప్‌ను ఓపెన్‌ చేసి ‘యాడ్‌ అకౌంట్‌’ మీద క్లిక్‌ చేయాలి. ఇందులో పర్సనల్‌, బిజినెస్‌, ఇతర రకాల ఖాతాల ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో అవసరమైన రకాన్ని ఎంచుకొని పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. ఈమెయిల్‌కు అందే కోడ్‌తోనైనా యూజర్లు తమను ధ్రువీకరించుకోవచ్చు.
  • అనంతరం బ్రౌజర్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌లో లాగిన్‌ కావాలి. మెయిన్‌ పేజీలోంచి సెక్యూరిటీ విభాగాన్ని ఎంచుకోవాలి. తర్వాత పేజీలో కింద కుడిపక్కన కనిపించే టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ మీద క్లిక్‌ చేయాలి. ధ్రువీకరణ విభాగంలో యాప్‌ను ఎంచుకోవాలి. అప్పుడు యాప్‌నకు కోడ్‌ అందుతుంది. దీన్ని ఎంటర్‌ చేయగానే రెండు ఖాతాలు అనుసంధానమవుతాయి. అప్పటి నుంచీ యాప్‌తో ధ్రువీకరించుకుంటే తప్ప మైక్రోసాఫ్ట్‌ ఖాతాలోకి ఎంటరవటం సాధ్యం కాదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని