ప్లేస్టోర్‌లో ప్రభుత్వ బ్యాడ్జి

ప్రభుత్వ ప్రాయోజిత యాప్‌లను పోలిన నకిలీ యాప్‌లు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ యాప్‌లను తేలికగా గుర్తించటానికి గూగుల్‌ ప్లే స్టోర్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Published : 08 May 2024 00:22 IST

ప్రభుత్వ ప్రాయోజిత యాప్‌లను పోలిన నకిలీ యాప్‌లు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ యాప్‌లను తేలికగా గుర్తించటానికి గూగుల్‌ ప్లే స్టోర్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్యాడ్జి రూపంలో ఉండే ఇది యాప్‌లు విశ్వసనీయమైనవో, కావో తెలుసుకోవటానికి తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేసి ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. మనదేశం విషయానికి వస్తే ప్లేస్టోర్‌లో డిజీలాకర్‌, ఎంఆధార్‌, ఎంపరివహన్‌, వోటర్‌ హెల్ప్‌లైన్‌ వంటి యాప్‌లను వెతికినప్పుడు వాటి మీద ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్‌ అనే బ్యాడ్జి కనిపిస్తుంది. వివరాలను తెలుసుకోవటానికి యాప్‌ పేరు మీద క్లిక్‌ చేసినప్పుడు ఈ బ్యాడ్జిని చూడొచ్చు. దీని మీద తడితే ఒక పాపప్‌ పైకి లేస్తుంది. అందులో ‘ప్లే వెరిఫైడ్‌ దిస్‌ యాప్‌ ఈజ్‌ అఫిలియేటెడ్‌ విత్‌ ఎ గవర్నమెంట్‌ ఎంటిటీ’ అనే సందేశం ప్రత్యక్షమవుతుంది. టాప్‌ ఛార్ట్స్‌ వంటి జాబితాల్లోనూ ఈ కొత్త బ్యాడ్జి కనిపిస్తుంది. తప్పుడు వివరణలు, తప్పుదోవ పట్టించే ఐకన్లు, స్క్రీన్‌షాట్లు గల యాప్‌లను గూగుల్‌ నిరంతరం తొలగిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ అధికారికమని పేర్కొనే యాప్‌ల సంఖ్యకు కొదవలేదు. ఈ కొత్త బ్యాడ్జి మూలంగా నకిలీ యాప్‌లు, ప్రభుత్వ యాప్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు