నిద్రకు అలెక్సా సాయం

నిద్రపట్టక సతమత మవుతున్నారా? పక్కనే అమెజాన్‌ ఎకో పరికరముందా? అయితే అలెక్సా సాయం తీసుకోవచ్చు. ‘అలెక్సా వాన చినుకుల చప్పుడు ప్లే చెయ్యి’ అని అడిగారనుకోండి.

Published : 12 Jun 2024 00:33 IST

నిద్రపట్టక సతమత మవుతున్నారా? పక్కనే అమెజాన్‌ ఎకో పరికరముందా? అయితే అలెక్సా సాయం తీసుకోవచ్చు. ‘అలెక్సా వాన చినుకుల చప్పుడు ప్లే చెయ్యి’ అని అడిగారనుకోండి. లేదూ మనసుకు ప్రశాంతత కలిగించే అలల వంటి చప్పుళ్లేవైనా సరే. దేన్ని ప్లే చేయమని ఆదేశించినా అలెక్సా చేసి పెడుతుంది మరి. ఎంత సమయం ప్లే చేయాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఏ చప్పుళ్లను ప్లే చేయాలో నిర్ణయించుకున్న తర్వాత ‘అలెక్సా, గంట వరకూ స్లీప్‌ టైమ్‌ సెట్‌ చెయ్యి’ అని చెబితే సరి. అప్పుడు కోరిన చప్పుడును ఆ సమయం వరకూ ప్లే చేసి, ఆపేస్తుంది. ఆలోపు కునుకు పట్టేస్తే ఇంకేం కావాలి? 


ఛాట్‌ కాపీ శుభ్రంగా..

ఛాట్‌జీపీటీలో ప్రశ్నను సంధించాక అది ఇచ్చే జవాబును కాపీ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంటుంది. అయితే మౌజ్‌తో మొత్తం టెక్స్ట్‌ను కాపీ, పేస్ట్‌ చేస్తే అంతా గజిబిజి ఫార్మాట్‌లో కనిపిస్తుంది. దీనికి బదులు జవాబు కింద ఒకదాని మీద మరోటి పరచుకున్న చదరాల బటన్‌ మీద క్లిక్‌ చేసి చూడండి. ఇది క్లీన్‌ వర్షన్‌ను కాపీ చేసి పెడుతుంది.

సొంత ఖాతాతోనే..

ఆన్‌లైన్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ను తెరచినప్పుడు గూగుల్‌ ఖాతాతోనో, సోషల్‌ మీడియా ఖాతాతోనో లాగిన్‌ కావొచ్చనే సూచనను గమనించే ఉంటారు. ఇటీవల ఇలాంటిది ఎక్కువగానూ చూస్తున్నాం. ఇది తేలికే కావొచ్చు గానీ సురక్షితం కాదు. కాబట్టి సొంత ఈమెయిల్‌ ఖాతాతోనే లాగిన్‌ కావటం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని