టెలిగ్రామ్ భలే భలే
మెసేజింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ప్రత్యేకతే వేరు. వాట్సప్, ఎస్‌ఎంఎస్ మెసేజ్‌లకు దీటైన ప్రత్యామ్నాయంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇందులో చాలా మంచి ఫీచర్లున్నాయి.
మెసేజింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ప్రత్యేకతే వేరు. వాట్సప్, ఎస్‌ఎంఎస్ మెసేజ్‌లకు దీటైన ప్రత్యామ్నాయంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇందులో చాలా మంచి ఫీచర్లున్నాయి. వీటి గురించి చాలామందికి తెలియదనే చెప్పుకోవచ్చు. అలాంటి సదుపాయాల్లో కొన్ని ఇవీ..
తేలికగా ఫోన్ నంబరు మార్పు
కొత్త ఫోన్‌కు మారినప్పుడు నంబరు మార్చుకోటం టెలిగ్రామ్‌లో చాలా తేలిక. సెటింగ్స్‌లోకి వెళ్లి, అకౌంట్ విభాగం కింద ఫోన్ నంబరును తాకితే ‘ఛేంజ్ నంబర్’ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి, ఆయా సూచనలు పాటిస్తే చాలు. టెలిగ్రామ్ దానంతటదే అన్ని కాంటాక్టులకు కొత్త నంబరును జోడించుకుంటుంది. కావాలంటే మరో నంబరునూ జత చేసుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్‌లోనైతే పైన ఎడమ వైపు అడ్డం మూడు గీతల మీద నొక్కాలి. తర్వాత ఫోన్ నంబరు మీద తాకితే ‘యాడ్ అకౌంట్’ విభాగం కనిపిస్తుంది. దీని ద్వారా రెండో నంబరును జత చేసుకోవచ్చు. ఐఫోన్‌లోనైతే ప్రొఫైల్ పేజీలో ఎడిట్ మీద తాకి ‘యాడ్ అనదర్ అకౌంట్’ను ఎంచుకోవాలి. ఇలా వ్యక్తిగత, ఉద్యోగ అవసరాలకు వేర్వేరు ఖాతాలను వాడుకోవచ్చు.
ఒకటి కన్నా ఎక్కువ ప్రొఫైల్ ఫొటోలు
బహుళ సదుపాయాల విషయంలో టెలిగ్రామ్‌ను మించింది లేదని చెప్పుకోవచ్చు. ఇందులో ఒకటి కన్నా ఎక్కువ ప్రొఫైల్ ఫొటోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా తాజాగా అప్‌డేట్ చేసిన ఫొటో కనిపిస్తుంది. పక్కలకు స్వైప్ చేస్తుంటే మిగతా ఫొటోలు కనిపిస్తాయి. కొత్త ప్రొఫైల్ ఫొటోను అప్‌లోడ్ చేయటానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెటింగ్స్‌ను ఓపెన్ చేసి, మన పేరు కిందుండే కెమెరా గుర్తును నొక్కాలి. ఐఫోన్‌లోనైతే ఎడిట్ బటన్‌ను తాకి ‘సెట్ న్యూ ఫొటో ఆర్ వీడియో’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత కొత్త ఫొటో తీసుకోవటమో.. అప్పటికే ఉన్న ఫొటోలనో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం ప్రొఫైల్ పిక్చర్ మీద నొక్కితే అన్నీ కనిపిస్తాయి. వీటిల్లో ఒకదాన్ని ‘సెట్ యాజ్ మెయిన్ ఫొటో’గా ఎంచుకోవచ్చు.
రహస్య ఛాట్స్ కూడా..
టెలిగ్రామ్ ఛాట్స్ అన్నీ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. కానీ డిఫాల్ట్ ఛాట్స్ టెలిగ్రామ్‌కు చెందిన సర్వర్లలో స్టోర్ అవుతాయి. దీని మూలంగానే వేర్వేరు పరికరాల్లోనూ వీటిని చూసుకోవటం సాధ్యమవుతుంది. ఇది మంచి సదుపాయమే అయినా కొన్నిసార్లు గోప్యతకు భంగం కలగొచ్చు. దీన్ని తప్పించుకోవటానికి రహస్య టెలిగ్రామ్ ఛాట్స్‌నూ సృష్టించుకోవచ్చు. ఇవి టెలిగ్రామ్ సర్వర్లలో నిల్వ ఉండవు. వీటిని ఆయా ఫోన్లలోనే చూసుకోవాల్సి ఉంటుంది. అవతలివారో, మనమో.. ఎవరో ఒకరు డిలీట్ చేసినా రెండు పరికరాల్లోనూ మాయమవుతాయి. ఆండ్రాయిడ్ ఫోన్‌లో కింద ఎడమవైపు ఉండే పెన్సిల్ గుర్తు మీద తాకితే ‘న్యూ సీక్రేట్ ఛాట్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఐఫోన్‌లో ఛాట్‌ను ఓపెన్ చేసి, కాంటాక్టు పేరు మీద తాకాలి. తర్వాత ‘మోర్’ను ఎంచుకొని ‘స్టార్ట్ సీక్రేట్ ఛాట్’ను పంపొచ్చు.
నచ్చినట్టుగా అలంకరణ
టెలిగ్రామ్‌లో రంగు, నేపథ్యాలను ఇష్టమైన విధంగా మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో థీమ్‌ను సరిచేసుకోవాలనుకుంటే సెటింగ్స్‌లోకి వెళ్లి, ఛాట్ సెటింగ్స్‌ను ఎంచుకోవాలి. ఐఫోన్‌లో సెటింగ్స్ ద్వారా అప్పీరియెన్స్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ అక్షరాల పరిమాణం, బుడగల రంగులు, నైట్ మోడ్ సెటింగ్స్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఛాట్ బ్యాక్‌గ్రౌండ్ ద్వారా గ్రూపుల కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. సొంత థీమ్‌ను సృష్టించుకోవాలంటే (ఆండ్రాయిడ్ ఫోన్‌లో) పైన నిలువు మూడు చుక్కల మీద తాకాలి. ఐఫోన్‌లోనైతే ‘క్రియేట్ న్యూ థీమ్’ను ఎంచుకోవాలి. డిఫాల్ట్ ఆప్షన్లు నచ్చకపోతే దీని ద్వారా ఇష్టమైనట్టుగా థీమ్‌ను మార్చుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayodhya Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం!
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత