త్వరలోనే థ్రెడ్స్‌ వెబ్‌ వర్షన్‌

సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా తమ థ్రెడ్స్‌ యాప్‌ను వెబ్‌ వర్షన్‌లోనూ తీసుకురానుంది. వచ్చే వారంలో దీన్ని పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది.

Updated : 23 Aug 2023 01:58 IST

సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా తమ థ్రెడ్స్‌ యాప్‌ను వెబ్‌ వర్షన్‌లోనూ తీసుకురానుంది. వచ్చే వారంలో దీన్ని పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మొబైల్‌ ఫోన్‌ వాడేవారిని దృష్టిలో పెట్టుకునే థ్రెడ్స్‌ యాప్‌ను రూపొందించారు. అందువల్ల వెబ్‌ వర్షన్‌లో కొన్ని థ్రెడ్సే అందుబాటులో ఉండొచ్చని అనుకుంటున్నారు. అంతర్గతంగా వెబ్‌ వర్షన్‌ను పరీక్షిస్తున్నామని థ్రెడ్స్‌ అండ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సీఈవో ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే థ్రెడ్స్‌ యాప్‌లో ఫాలోయింగ్‌ ట్యాబ్‌ను జోడించారు. తమ మాస్టడాన్‌ ఫ్రొఫైల్‌లో లింక్‌ను ధ్రువీకరించుకునే వెసులుబాటూ కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని