ఐఎస్‌ఎస్‌ను చూస్తారా?

ఆకాశంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్‌ఎస్‌) చూడాలని అనుకుంటున్నారా? ఒకవేళ చూడాలనుకున్నా అది ఎక్కడుందో మాకెలా తెలుస్తుందని పెదవి విరుస్తున్నారా?

Published : 15 Nov 2023 01:09 IST

ఆకాశంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్‌ఎస్‌) చూడాలని అనుకుంటున్నారా? ఒకవేళ చూడాలనుకున్నా అది ఎక్కడుందో మాకెలా తెలుస్తుందని పెదవి విరుస్తున్నారా? అయితే స్పేస్‌ స్టేషన్‌ యాప్‌ సాయం తీసుకోండి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవలే దీన్ని విడుదల చేసింది. తమ స్పేస్‌ స్టేషన్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా ఈ యాప్‌ను రూపొందించింది. ఆకాశంలో అతి ప్రకాశవంతంగా కనిపించే మూడో వస్తువు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే. ఎప్పుడు, ఎక్కుడుందో తెలిస్తే తేలికగానే గుర్తించొచ్చు. టెలిస్కోప్‌ల వంటి సాధనాలేవీ లేకుండా మామూలుగానే చూడొచ్చు. ఇది వేగంగా కదులుతున్న విమానంలా కనిపిస్తుంది. కాకపోతే చాలా ఎత్తులో, గంటకు 17,500 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంటుంది. స్పేస్‌ స్టేషన్‌ యాప్‌ ద్వారా ఐఎస్‌ఎస్‌ లొకేషన్‌ను 2డీ, 3డీలో చూడొచ్చు. ఫొటోలు, వీడియోలు తీసి షేర్‌ చేసుకోవచ్చు. తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దీనిపై సూర్యరశ్మి బాగా ప్రసరిస్తుంది. అందువల్ల ఈ సమయాల్లో ఐఎస్‌ఎస్‌ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు ప్రకాశవంతంగా కనిపిస్తుందో యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. సరిగ్గా అప్పుడు ఆకాశంలోకి చూస్తే ఐఎస్‌ఎస్‌ కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని