ఎక్స్‌ క్యాచీ శుభ్రం

ఎక్స్‌ (ట్విటర్‌) మొబైల్‌ యాప్‌ ఫోన్‌లో, ట్యాబ్లెట్‌లో క్యాచ్డ్‌ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్‌లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్‌ వెబ్‌, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది.

Published : 21 Feb 2024 00:25 IST

క్స్‌ (ట్విటర్‌) మొబైల్‌ యాప్‌ ఫోన్‌లో, ట్యాబ్లెట్‌లో క్యాచ్డ్‌ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్‌లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్‌ వెబ్‌, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. దీంతో అనవసర ఫొటోలు, జిఫ్స్‌, వెబ్‌ డేటా డిలీట్‌ అవుతాయి. ట్విటర్‌ యాప్‌ వేగమూ పుంజుకుంటుంది. ఐఫోన్‌, ఐప్యాడ్‌లోనైతే నేరుగా ఎక్స్‌ యాప్‌ నుంచే క్యాచీ ఫైళ్లను డిలీట్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లోనైతే ఫోన్‌ సెటింగ్స్‌ నుంచి ఎక్స్‌ యాప్‌లోకి వెళ్లి తొలగించుకోవాలి.

ఐఫోన్‌, ఐప్యాడ్‌లో: ఎక్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ప్రొఫైల్‌ ఫొటో మీద తాకాలి. కింద జాబితాల్లోంచి సెటింగ్స్‌ అండ్‌ ప్రైవసీ ద్వారా యాక్సెసబిలిటీ, డిస్‌ప్లే, అండ్‌ లాంగ్వేజస్‌లోకి వెళ్లి డేటా యూసేజ్‌ను ఎంచుకోవాలి. అప్పుడు మీడియా స్టోరేజీ, వెబ్‌ స్టోరేజీ ఆప్షన్లు కనిపిస్తాయి. మీడియా స్టోరేజీలో ఫొటోలు, జిఫ్స్‌ వంటి మీడియా పైళ్ల క్యాచ్డ్‌ వర్షన్లు ఉంటాయి. దీని మీద తాకి క్లియర్‌ మీడియా స్టోరేజీని ఎంచుకొని కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. ఇప్పుడు మరోసారి క్లియర్‌ మీడియా స్టోరేజీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని కన్‌ఫర్మ్‌ చేసుకోగానే క్యాచ్డ్‌ ఫైళ్లు డిలీట్‌ అవుతాయి. తిరిగి డేటా యూసేజ్‌ పేజీ కనిపిస్తుంది. ఇప్పుడు వెబ్‌ స్టోరేజీని క్లిక్‌ చేయాలి. ఇందులో కుకీస్‌, వెబ్‌సైట్లు, పాస్‌వర్డ్‌ల క్యాచీలు.. అలాగే ఎక్స్‌ యాప్‌తో ఉపయోగించుకున్న వెబ్‌సైట్ల సమాచారం ఉంటాయి. వెబ్‌ స్టోరేజీలో క్లియర్‌ వెబ్‌ పేజ్‌ స్టోరేజీ, క్లియర్‌ ఆల్‌ వెబ్‌ స్టోరేజీ ఆప్షన్లుంటాయి. క్లియర్‌ వెబ్‌ పేజ్‌ స్టోరేజీని ఎంచుకుంటే ఎక్స్‌ యాప్‌ నుంచి వెబ్‌సైట్ల క్యాచీ మాత్రమే తొలగిపోతుంది. కుకీస్‌, ఫోన్‌లో లేదా ట్యాబ్లెట్‌లో సేవ్‌ అయిన లాగిన్స్‌ అలాగే ఉంటాయి. అదే క్లియర్‌ ఆల్‌ వెబ్‌ స్టోరేజీని ఎంచుకుంటే మొత్తం వివరాలు పోతాయి.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో: ఫోన్‌ సెటింగ్స్‌ ద్వారా యాప్స్‌లోకి వెళ్లి మేనేజ్‌ యాప్స్‌ మీద తాకాలి. ఇందులోకి ఎక్స్‌ యాప్‌ను ఎంచుకొని స్టోరేజీ మీద తాకాలి. పేజీలో కింద కనిపించే క్లియర్‌ డేటాను క్లిక్‌ చేస్తే క్లియర్‌ ఆల్‌ డేటా, క్లియర్‌ క్యాచీ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో క్లియర్‌ క్యాచీని ఎంచుకుంటే క్యాచ్డ్‌ ఫైళ్లు తొలగిపోతాయి. ఒకవేళ క్లియర్‌ ఆల్‌ డేటాను ఎంచుకుంటే తిరిగి ఎక్స్‌ యాప్‌ను రీసెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని