Google: హెల్త్‌, ఫిట్‌నెస్‌ యాప్‌ల సమాచారమంతా ఒకచోటే!

హెల్త్‌, ఫిట్‌నెస్‌ యాప్‌లలోని సమాచారాన్ని ఒకచోటే యాక్సెస్‌ చేసేందుకు వీలుగా గూగుల్ హెల్త్‌ కనెక్ట్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్‌ బీటా వెర్షన్‌ మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంది. 

Published : 16 Nov 2022 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హెల్త్‌, ఫిట్‌నెస్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు యూజర్లకు తెలియజేసేందుకు హెల్త్‌ కనెక్ట్ (Health Connect) పేరుతో గూగుల్ (Google) కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆండ్రాయిడ్ ఆధారిత ఫిట్‌నెస్‌, హెల్త్‌ యాప్‌లలోని సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా ఎప్పుడైనా యాక్సెస్‌ చేయొచ్చు.  చాలా మంది యూజర్లు హెల్త్‌, ఫిట్‌నెస్‌ కోసం వేర్వేరు యాప్‌లను ఉపయోగిస్తుంటారు. అందులోని డేటా కోసం ప్రతిసారీ ఆయా యాప్‌లను ఓపెన్‌ చేయాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని యాప్‌లలోని సమాచారం ఒకచోట యాక్సెస్‌ చేసేందుకు వీలుగా గూగుల్ హెల్త్‌ కనెన్ట్ యాప్‌ను ప్రవేశపెట్టింది. 

ఇతర హెల్త్‌, ఫిట్‌నెస్‌ యాప్‌ల నుంచి హెల్త్‌ కనెక్ట్‌లో షేర్‌ చేసే సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఈ యాప్‌తో సమాచారాన్ని పంచుకునేందుకు వీలుగా యూజర్లు తాము ఉపయోగిస్తున్న హెల్త్‌, ఫిట్‌నెస్‌ యాప్‌లలో డేటా షేరింగ్‌కు అనుమతించాలి. యూజర్లు పాత డివైజ్‌ నుంచి కొత్త డివైజ్‌కు మారుతున్నప్పడు యాప్‌లో స్టోర్‌ అయిన సమాచారం డిలీట్‌ అవుతుంది. హెల్త్‌ కనెక్ట్‌తో ఆ సమస్య ఉండదని గూగుల్ చెబుతోంది. ప్రస్తుతం హెల్త్‌ కనెక్ట్ యాప్‌ బీటా వెర్షన్‌ మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌ పరీక్షించాలనుకునే వారు ప్లేస్టోర్‌ నుంచి బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని