Google Chrome: క్రోమ్ కొత్త మోడ్స్.. ఇకపై పవర్, మెమొరీ రెండు ఆదా!
గూగుల్ క్రోమ్ సిస్టమ్ మెమొరీని ఎక్కువగా వాడుతుందనేది ఎక్కువ మంది యూజర్లు చెప్పేమాట. క్రోమ్‌లో బ్రౌజింగ్ చేస్తే సిస్టమ్ పనితీరు మందకొడిగా ఉంటుందని చెబుతుంటారు. తాజా అప్డేట్తో ఈ సమస్యలకు గూగుల్ చెక్ పెట్టనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వెబ్ విహారానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది గూగుల్ క్రోమ్ (Google Chrome) బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు బ్రౌజర్‌ను అప్డేట్ చేయడం, బగ్‌ఫిక్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ వంటివి బ్రౌజర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. కానీ, సిస్టమ్ ర్యామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుందనేది చాలా మంది యూజర్ల అభిప్రాయం. అంటే, పీసీ లేదా కంప్యూటర్లో 8 జీబీ నుంచి 64 జీబీ ఎంతటి సామర్థ్యం ర్యామ్ ఉన్నా.. అందులో అధిక మొత్తాన్ని క్రోమ్ వాడేస్తుందని యూజర్లు అసహనం వ్యక్తం చేస్తుంటారు. దీనివల్ల పీసీ బ్యాటరీ, మెమొరీపై ఎక్కువ భారం పడుతుంది. ఎంతో కాలంగా ఇదే విషయమై గూగుల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.
గూగుల్ ఎట్టకేలకు ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపింది. కొత్తగా మెమొరీ సేవర్ (Memory Saver), ఎనర్జీ సేవర్ (Energy Saver) అనే రెండు కొత్త మోడ్‌లను క్రోమ్ బ్రౌజర్లో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ రెండు కూడా యూజర్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించేటప్పుడు పీసీ/కంప్యూటర్లోని బ్యాటరీ, మెమొరీపై భారాన్ని తగ్గిస్తాయని తెలిపింది.
మెమొరీ సేవర్ (Memory Saver)
క్రోమ్ బ్రౌజర్లో వెబ్ విహారం చేసే సమయంలో ఎన్నో ట్యాబ్‌లు ఓపెన్ చేస్తుంటాం. వాటిలో కొన్ని ఇన్‌యాక్టివ్‌లో ఉండి బ్రౌజర్ ఎక్కువ మెమొరీని ఉపయోగించేలా చేస్తాయి. దాంతో సిస్టమ్ పనితీరు మందకొడిగా సాగుతుంది. ఇలాంటి ట్యాబ్స్‌ను మెమొరీ సేవర్ మోడ్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. దీంతో బ్రౌజర్‌తోపాటు, పీసీ/కంప్యూటర్ వేగంగా పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. ఒకే సమయంలో క్రోమ్ బ్రౌజర్, యాప్స్, వీడియో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించేప్పుడు.. వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు సిస్టమ్ వేగంగా పనిచేసేందుకు ఈ మోడ్ ఉపయోగపడుతుంది.
ఎనర్జీ సేవర్ (Energy Saver)
ఎనర్జీ సేవర్ మోడ్ క్రోమ్ బ్రౌజర్ ఎంతమేర బ్యాటరీ నుంచి పవర్‌ను వాడుతుందనేది పరిశీలిస్తుంటుంది. సిస్టమ్ బ్యాటరీ 20 శాతం మాత్రమే ఉన్నప్పుడు ఈ మోడ్ క్రోమ్ బ్రౌజర్లో బ్యాగ్రౌండ్ యాక్టివిటీని, విజువల్ ఎఫెక్ట్స్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల యూజర్ సిస్టమ్ బ్యాటరీని ఎక్కువ సమయం ఉపయోగించుకునే వీలుంటుందని గూగుల్ వెల్లడించింది. యూజర్లు క్రోమ్ (v108) కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకుని వీటి సేవలను పొందొచ్చు. ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రాగా, దశలవారీగా పూర్తిస్థాయిలో యూజర్లకు వీటిని పరిచయం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రీల్స్‌లో 20 పాటలు
ఇన్స్టాగ్రామ్ ఇటీవల మల్టీ ట్రాక్ ఆడియో ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో ఒక్క రీలులో 20 ట్రాక్‌లను జత చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం మనదేశంలోని యూజర్లకే అందుబాటులోకి తెచ్చారు. -
ఇక వాట్సప్ ఛాట్స్ అనువాదం
ఇతర భాషలు తెలియని వాట్సప్ ప్రియులకు మంచి కబురు. అన్ని ఛాట్ మెసేజ్‌లను అనువాదం చేయగల ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. -
ఈ ఈమెయిళ్లు ప్రయత్నిస్తారా?
ఈమెయిల్ ప్రొవైడర్లనగానే జీమెయిల్, అవుట్‌లుక్, యాహూ వంటివే గుర్తుకొస్తాయి. వెతకాలే గానీ ఉచిత ఈమెయిల్ సర్వీసులు చాలానే కనిపిస్తాయి. -
యూట్యూబ్ వినూత్నంగా..
ప్రీమియం చందాదారులకు యూట్యూబ్ ఐదు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రెండు ఇప్పటికే విస్తృతంగా వాడకంలోకి రాగా మరో మూడు ప్రయోగదశల్లో ఉన్నాయి. -
ఆగిన చోటు నుంచే ట్యాబ్స్ మొదలు
కొన్నిసార్లు చాలా ట్యాబ్స్‌ను ఓపెన్ చేయాల్సి వస్తుంటుంది. మధ్యలో ఏదైనా పనిపడితే విరామం తీసుకోవాల్సి రావొచ్చు. -
వాట్సప్‌లో హెచ్డీ ఇమేజ్‌ల షేరింగ్
వాట్సప్‌లో హెచ్డీ ఆప్షన్ ద్వారా అధిక నాణ్యతతో కూడిన ఇమేజ్‌లు, వీడియోలను పంపటం తెలిసిందే. కానీ ప్రతిసారీ ఈ ఆప్షన్‌ను ఎంచుకోవటం కొన్నిసార్లు చిరాకు కలిగించొచ్చు. -
మోషీ.. మరో కొత్త ఛాట్‌బాట్
గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ టెక్ సంస్థలు తమ ఛాట్బాట్స్ను బలోపేతం చేయటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. -
యూట్యూబ్‌లో ఎరేజ్ సాంగ్ మెరుగ్గా
యూట్యూబ్‌లో కంటెంట్‌ను సృష్టించేవారికి మంచి కబురు. ఇప్పుడు ఎరేజ్ సాంగ్ టూల్ మరింత మెరుగులు దిద్దుకుంది. -
నోట్స్.. కొత్తకొత్తగా!
ఐఫోన్లో బాగా ఉపయోగపడే యాప్స్‌లో నోట్స్ ఒకటి. బిల్టిన్‌గా డాక్యుమెంట్ స్కానర్ వంటి అదనపు ఫీచర్లూ దీని సొంతం. ఐఓఎస్18 రాకతో ఇది మరింత మెరుగైంది కూడా. -
కోపైలట్ వినూత్న ఫీచర్లు
కోపైలట్ బాట్ చాలా మారిపోయింది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ కొత్తగా 14 కోపైలట్ ఫీచర్లను పరిచయం చేసింది మరి. మైక్రోసాఫ్ట్ 365 ఖాతా కలిగినవారు ఎవరైనా వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ వంటి అన్ని యాప్‌ల్లో వాడుకోవచ్చు. -
ఆండ్రాయిడ్ కోసం కలెక్షన్స్
ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని పేరు కలెక్షన్స్. ఇది ఇన్స్టాల్ అయిన యాప్‌ల నుంచి సమంజసమైన కంటెంట్‌ను చూపించగలదు. -
ట్రూకాలర్ బీమా
ట్రూకాలర్ అనగానే ఫోన్ చేసే వ్యక్తుల గురించి తెలియజేయటమే గుర్తుకొస్తుంది. ఇప్పుడిది తమ యాప్‌ను వాడేవారిని ఆన్లైన్ మోసాలు, నేరాల నుంచి కాపాడుకోవటానికీ నడుం బిగించింది. -
వాట్సప్ బృందాల్లో ఈవెంట్స్
వాట్సప్ కొత్తగా గ్రూప్ ఛాట్స్‌లో ఈవెంట్స్ ఫీచర్‌ను ఆరంభించింది. దీంతో గ్రూప్ ఛాట్స్‌లో సులభంగా, నేరుగా సమావేశాలను నిర్వహించుకోవచ్చు. -
గూగుల్ ట్రాన్స్‌లేట్ భాషల విస్తరణ
టెక్ దిగ్గజం గూగుల్ తమ అనువాద సేవలను గణనీయంగా విస్తరించింది. గూగుల్ ట్రాన్స్‌లేట్‌కు మరో 110 భాషలను జోడించింది. -
విమర్శ జీపీటీ కూడా..
క్రిటిక్‌జీపీటీ అనే కొత్త ఏఐ మోడల్‌ను రూపొందిస్తున్నట్టు ఓపెన్ ఏఐ సంస్థ ప్రకటించింది. జీపీటీ-4తో రూపొందించిన కోడ్‌లో పొరపాట్లను గుర్తించి, సరిచేయటం దీని ఉద్దేశం. -
ఇక వెబ్ పేజీని క్రోమ్ చదివి పెడుతుంది
ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ క్రోమ్ వాడేవారికి శుభవార్త. ఇప్పుడు దీనికి కొత్తగా లిజన్ టు దిస్ పేజ్ ఫీచర్ తోడైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది వెబ్‌పేజీని బిగ్గరగా చదివి వినిపిస్తుంది. -
యాప్ యోగం!
శరీరాన్ని, మనసును సంయోగం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చటానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో భాగమైన ఆసనాలు శరీరం బలంగా ఉండటానికి.. కండరాలు, కీళ్లు సాఫీగా కదలటానికి తోడ్పడతాయి. అలాగే పొట్టలోని అవయవాలను సున్నితంగా మర్దన చేస్తాయి. -
క్లాడ్ 3.5 సోనెట్ వినూత్న ఏఐ మోడల్
కృత్రిమ మేధ రంగంలో రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. వినూత్న మోడళ్లను సృష్టించటంలో సంస్థలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓపెన్ఏఐ పోటీ సంస్థ ఆంత్రోపోనిక్ కంపెనీ తీసుకొచ్చిన తాజా మోడలే దీనికి నిదర్శనం. -
వాట్సప్ మాటలు అక్షరాల్లో
వాట్సప్‌లో వాయిస్ మెసేజ్‌లు కొత్త కాదు. కానీ ఆ మాటలు అక్షరాలుగా మారితే? ఇలాంటి వినూత్న ఫీచర్ మీద వాట్సప్ దృష్టి సారించింది. ఇది ఫోన్లో నేరుగా మాటలను అక్షరాల రూపంలోకి మార్చేస్తుంది. -
నవ యూట్యూబ్
అతి పెద్ద వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ నిరంతరం తనకు తాను మెరుగవుతూనే వస్తోంది. తాజాగా ఏఐ లైవ్ ఛాట్, ఛానల్స్ కోసం క్యూఆర్ కోడ్, సెర్చింగ్‌కు గూగుల్ లెన్స్ జత చేయటం వంటి అధునాతన ఫీచర్లను పరిచయం చేయనుంది. -
ఛాట్‌జీపీటీతో పీడీఎఫ్ ఫైలు వివరాలు
పీడీఎఫ్ ఫైలులో చాలా కంటెంట్ ఉందా? దాని సారాంశాన్ని చిటికెలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఛాట్‌జీపీటీ సాయం తీసుకోవచ్చు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు