‘రిలేట్‌’ హిందీలో

ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రామాణికం కాని పదాలను, యాసను అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.

Updated : 28 Dec 2022 00:37 IST

ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రామాణికం కాని పదాలను, యాసను అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి గూగుల్‌ సంస్థ ప్రాజెక్ట్‌ రిలేట్‌ యాప్‌ను ఆరంభించింది. మనదేశంలోనూ దీన్ని పరీక్షిస్తోంది. ప్రస్తుతానికిది ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉంది గానీ వచ్చే సంవత్సరం ఆరంభంలో హిందీకీ విస్తరించనుంది. గూగుల్‌ అసిస్టెంట్‌ మాదిరిగా మాటలను గుర్తించే పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్‌లో లిజన్‌, రిపీట్‌, అసిస్టెంట్‌ అనే మూడు ప్రధాన ఫీచర్లుంటాయి. లిజన్‌ అప్పటికప్పుడు మాటలను పదాల్లోకి మారుస్తుంది. దీన్ని కాపీ చేసి, ఇతర యాప్స్‌లో పేస్ట్‌ చేసుకొని అసలు మాటలను తెలుసుకోవచ్చు. ఇక రిపీట్‌ ఫీచర్‌ మాటలను మరింత స్పష్టంగా తిరిగి వినిపిస్తుంది.  అసిస్టెంటేమో నేరుగా గూగుల్‌ అసిస్టెంట్‌తో మాట్లాడటానికి వీలు కల్పిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని