వాట్సప్ ట్రిక్కులు వారెవ్వా!
నేటి టెక్నాలజీ యుగంలో తక్షణ సందేశాల వేదికలు ఎంత ఆదరణ పొందుతున్నాయో! వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వాట్సప్ గురించే.
నేటి టెక్నాలజీ యుగంలో తక్షణ సందేశాల వేదికలు ఎంత ఆదరణ పొందుతున్నాయో! వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వాట్సప్ గురించే. సందేశాల చేరవేత, భావ వ్యక్తీకరణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అందుకే నిత్య జీవన వ్యవహారాల్లో విడదీయలేని భాగంగానూ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నెలకు 224 కోట్ల మంది.. మనదేశంలో సుమారు 49 కోట్ల మంది వాట్సప్‌ను వాడుతున్నారు! అయినప్పటికీ దీనిలోని కొన్ని ఫీచర్లు ఇప్పటికీ చాలామందికి తెలియవు. అలాంటి కొన్నింటి వివరాలు ఇవీ..
స్టేటస్ నిశ్చలం
వాట్సప్‌లో సందేశాలు మాత్రమేనా? స్టేటస్ కూడా బాగా ఆదరణ పొందింది. ఎవరెవరు ఏయే స్టేటస్‌లు పెట్టారోనని ప్రతిక్షణం చూడటం పరిపాటిగా మారింది. వీటితో చిక్కేంటంటే- నిర్ణీత కాలం వరకే కనిపించటం. ఒకవేళ ఎక్కువసేపు చూడాలంటే దాని మీద నొక్కి పట్టాల్సి ఉంటుంది. ఇలా నొక్కకుండా ఆయా స్టేటస్‌ల నుంచి మనం బయటకు వచ్చేంతవరకు అవి అలాగే ఉంటే? దీనికి తేలికైన మార్గముంది. తెలిస్తే ఓస్ ఇంతేనా? అనీ అనుకోకుండా ఉండలేరు. చూస్తున్న స్టేటస్ మీద మూడు వేళ్లతో ఒకేసారి తాకితే చాలు. మనం ఎగ్జిట్ అయ్యేంతవరకు అది తెర మీద అలాగే ఉంటుంది.
స్టేటస్‌ను చూసినట్టు తెలియకుండా
స్టేటస్‌ను పెట్టిన తర్వాత దాని మీద ట్యాప్ చేస్తే ఎవరెవరు, ఎప్పుడు చూశారో తెలుస్తుంది కదా. అయితే కొన్నిసార్లు ఆయా స్టేటస్‌లను మనం చూసినట్టు వాటిని పోస్ట్ చేసినవారికి తెలియొద్దని అనుకోవచ్చు. ఇలాంటి సమయంలో రీడ్ రిసీప్ట్స్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే స్టేటస్‌ను చూసినా ఆ విషయం అవతలివారికి తెలియదు. వాట్సప్ సెటింగ్స్‌లో ప్రైవసీ విభాగాన్ని తెరిస్తే రీడ్ రిసీప్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
నంబర్ సేవ్ చేయకుండానే
ఎవరో ఫోన్ చేస్తారు. ఆ నంబరు మన కాంటాక్ట్స్ జాబితాలోది కాదు. అత్యవసరంగా వాట్సప్‌లో వారికేదో సందేశాన్ని పంపాల్సి వచ్చింది. నిజానికి కాంటాక్ట్ సేవ్ అయితే తప్ప వాట్సప్‌లో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరపటం సాధ్యం కాదు. అవతలి వారి నంబరును కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవటం ఇష్టం లేదు. అయినా వాట్సప్ ద్వారా సందేశం పంపాలి. ఎలా? దీనికీ మార్గముంది. ఆ నంబరును కాపీ చేసుకొని, వాట్సప్‌లో సెల్ఫ్-ఛాట్ ఆప్షన్‌లో పేస్ట్ చేసుకోవాలి. మెసేజ్‌ను పంపించాలి. ఛాట్‌లోకి వెళ్లి ఆ నంబరు మీద క్లిక్ చేస్తే.. ఛాట్ విత్, కాల్ ఆన్ వాట్సప్, యాడ్ టు కాంటాక్ట్స్ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో ఛాట్ విత్‌ను ఎంచుకుంటే సరి.
గ్రూపులో చూసిందెవరో?
ఛాట్ గ్రూప్ పెద్దది. మనమేదో ముఖ్యమైన మెసేజ్‌ను పంపిస్తాం. దాన్ని ఎవరు చూశారో, ఎవరు చూడలేదో తెలియాలంటే? ముందుగా గ్రూప్ ఛాట్‌ను ఓపెన్ చేయాలి. పంపించిన మెసేజ్‌ను ఎంచుకొని, కాసేపు నొక్కిపట్టాలి. అనంతరం పైన కుడివైపున కనిపించే మూడు నిలువు చుక్కల మీద తాకి, ఇన్ఫో ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ మెసేజ్‌ను ఎవరెవరు చూశారో వారి జాబితా కనిపిస్తుంది.
గ్రూపులో ఒకరికే
గ్రూపులో ఎంతోమంది ఉంటారు. ఛాటింగ్ చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఛాటింగ్‌కు అంతరాయం కలిగించకుండా ఎవరో ఒకరికే సమాధానం ఇవ్వాలని అనిపించొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం ప్రతిస్పందించాలనుకునే మెసేజ్‌ను నొక్కి, కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత పైన కనిపించే మూడు నిలువు చుక్కలను తాకాలి. ఇందులో ‘రిప్లయ్ ప్రైవేట్లీ’ ఆప్షన్ ఎంచుకొని, సమాధానాన్ని టైప్ చేసి సెండ్ చేయాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
Politics News
రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి