Twitter: ట్వీట్‌లో ట్యాగ్‌.. అనుమతి ఉండాల్సిందే!

యూజర్‌ ప్రైవసీ అప్‌డేట్‌లో భాగంగా ట్విటర్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్ల వ్యక్తగత గోప్యతకు మరింత భద్రత లభిస్తుందని ట్విటర్‌ భావిస్తోంది. ఆ ఫీచర్‌ గురించి తెలుసుకుందాం.

Published : 17 Oct 2022 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ వేధింపులు, సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో యూజర్లకు అడ్వాన్స్‌డ్‌ ప్రైవసీ ఫీచర్లు అందించడంపై సోషల్‌ మీడియా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్విటర్‌ కొత్తగా మరో ప్రైవసీ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ట్వీట్‌లో తమని ఎవరెవరు ట్యాగ్‌ చేయొచ్చదనేది ఆయా యూజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ట్వీట్‌లో @వ్యక్తిపేరు (ఉదా: @Twitter) అని టైప్‌ చేసి ఒక యూజర్‌ మరో యూజర్‌ను ట్యాగ్‌ చేయొచ్చు. త్వరలోనే రాబోయే ప్రైవసీ అప్‌డేట్‌తో యూజర్ల అనుమతి లేకుండా ఇతరులు వారిని ట్వీట్‌ లేదా రిప్లైలో ట్యాగ్ చేయలేరు. దీంతో పబ్లిక్ ఖాతా నిర్వహించే యూజర్లకు మెరుగైన ప్రైవసీ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని ట్విటర్‌ భావిస్తోంది. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనుంది. 

ట్విటర్‌ వినియోగాన్ని యూజర్లు చేరువచేయడం కోసం అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకోవద్దని కోరుతోంది. దానికి బదులుగా ట్వీట్‌ లింక్‌ కాపీ లేదా ట్వీట్‌ను షేర్‌ చేయాలని సూచిస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు పరిచయం చేయనుంది. దీంతోపాటు ఫొటో, వీడియో లేదా గిఫ్‌.. మూడు మీడియా ఫైల్‌ను ఒకేసారి టెక్ట్స్‌తోపాటు ట్వీట్‌ చేసేలా కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.  ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలోని యూజర్స్‌తో పరీక్షిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు