వీఆర్‌ గేమ్‌తో ఏడీహెచ్‌డీ గుర్తింపు!

వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) గేమ్స్‌, కళ్ల కదలికలను పసిగట్టే ఐ ట్రాకింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వ్యవస్థల సాయంతో ఏకాగ్రత లోపంతో కూడిన అతి చురుకుదనం (ఏడీహెచ్‌డీ) సమస్యను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు.

Updated : 28 Dec 2022 00:38 IST

వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) గేమ్స్‌, కళ్ల కదలికలను పసిగట్టే ఐ ట్రాకింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వ్యవస్థల సాయంతో ఏకాగ్రత లోపంతో కూడిన అతి చురుకుదనం (ఏడీహెచ్‌డీ) సమస్యను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆటిజమ్‌ వంటి జబ్బులను గుర్తించేలా, ఏడీహెచ్‌డీ చికిత్సకు ఉపయోగపడేలా దీన్ని మార్చుకోవచ్చనీ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6% మంది పిల్లలు ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నారని అంచనా. దీన్ని పోల్చుకోవటానికి తోడ్పడే జీవ సూచికలను కనుగొనాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. ఇప్పటికీ ప్రశ్నలు, సమాధానాలు, ప్రవర్తన ఆధారంగానే ఏడీహెచ్‌డీని నిర్ధరిస్తున్నారు. అయితే ఇవి అన్నిసార్లూ కచ్చితంగా సమస్యను గుర్తించటానికి తోడ్పడకపోవచ్చు. రోజువారీ పరిస్థితులను పిల్లలు ఎలా ఎదుర్కొంటు న్నారనే విషయాన్ని ప్రామాణిక ప్రవర్తన పరీక్షలు అంతగా తెలియజేయలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ, ఆల్టో యూనివర్సిటీ, అకాడమీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న వర్చువల్‌ రియాలిటీ గేమ్‌ను రూపొందించారు. దీని పేరు ఎపెలీ. రోజువారీ ఎదురయ్యే పరిస్థితులను కాల్పనిక వాస్తవ ప్రపంచంలో సృష్టించటం దీనిలోని కీలకాంశం. వీటిని పిల్లలు ఎలా ఎదుర్కొంటున్నారో దీని ద్వారా బయటపడుతుంది. ఏడీహెచ్‌డీ లక్షణాలను సైతం దీంతో అంచనా వేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని