WhatsApp Updates: వెబ్‌ వాట్సాప్ కొత్త లుక్‌... స్టేటస్‌లో లింక్‌ ‘క్లిక్‌’!

వాట్సాప్‌ (WhatsApp) నుంచి త్వరలో రెండు కొత్త అప్‌డేట్స్‌ రాబోతున్నాయి. వెబ్‌ వాట్సాప్‌లో యూజర్‌ యాక్సెస్‌ కోసం ఒకటి అయితే, రెండోది యాప్‌ యూజర్ల కోసం. 

Updated : 13 Oct 2022 20:06 IST

ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ (WhatsApp) మరో రెండు కీలక ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఒకటి డెస్క్‌టాప్‌ వెర్షన్‌ కోసం కాగా, రెండోది యాప్‌ యూజర్ల కోసం. ఒకటి స్టేటస్‌ నుంచి సులభంగా సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లగలిగేలా చేస్తే.. రెండో ఆప్షన్‌ వాట్సాప్‌లోని ఆప్షన్లను ఈజీగా యాక్సెస్‌ చేసేలా ఉపయోగపడుతుంది. 


క్లిక్‌ చేసి వెళ్లొచ్చు

వాట్సాప్‌ యాప్‌లో ఇమేజ్‌ లేదా వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నప్పడు దిగువ బాక్స్‌లో కేవలం టెక్స్ట్‌ మాత్రమే ఇచ్చే ఆప్షన్‌ ఇప్పుడు ఉంది. ఇకపై అందులో వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ కూడా ఇవ్వొచ్చు. అలా ఇచ్చినప్పుడు ఆ టెక్స్ట్‌ను క్లిక్‌ చేసి సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లేలా వాట్సాప్‌ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ మార్పను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 


సైడ్‌ బార్‌ వస్తోంది

వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (UI) కొత్త లుక్‌లోకి మారుస్తున్నారు. చాట్‌ లిస్ట్‌ ఎడమ వైపు సైడ్‌బార్‌ కనిపిస్తుంది. అందులో  పైన చాట్స్‌ లిస్ట్‌ ఐకాన్‌, స్టేటస్‌ ఐకాన్‌ ఉంటాయి. దిగువన సెట్టింగ్స్‌, ప్రొఫైల్‌, ఫీడ్‌బ్యాక్‌ ఆప్షన్లు ఉంటాయి. ఇప్పటివరకు ఈ ఐకాన్‌లు కొన్ని ఛాట్‌ లిస్ట్‌ పై భాగంలో, ఇంకొన్ని సెట్టింగ్స్‌లో కనిపించేవి. యూజర్లకు సులువుగా యాక్సెస్‌ ఉండేలా ఎడమవైపు సైడ్‌ బార్‌ను ఇస్తున్నారు. త్వరలో రాబోయే అప్‌డేట్‌తో ఈ మార్పు కనిపిస్తుంది. 

వాట్సాప్ డెస్క్‌టాప్‌ 2.2240.1.0 వెర్షన్‌ వాడుతున్న బీటా యూజర్లకు ఈ మార్పులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే సాధారణ యూజర్లకూ వీటిని పరిచయం చేయనున్నారు. గత నెలలో డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం మెసేజ్‌ రియాక్షన్‌, స్టేటస్‌ రిప్లై వంటి ఫీచర్లను వాట్సాప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  


ఈ ఆప్షన్లూ వస్తున్నాయ్‌

ఇవేకాకుండా గ్రూపులో సభ్యులుగా ఉండేవారి సంఖ్యను 512 నుంచి 1024కు పెంచుకునే విధంగా వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్‌లో అభిప్రాయ సేకరణ కోసం పోల్‌ ఫీచర్‌ ఇస్తున్నారు. తేదీల ఆధారంగా పాత మెసేజ్‌లను సెర్చ్‌ చేసుకునేలా ఒక ఫీచర్‌...  సైలెంట్‌గా గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అయ్యేందుకు మరో ఫీచర్‌ త్వరలో రానున్నాయి. గ్రూపులో రిప్లై ఇచ్చిన వ్యక్తి ప్రొఫైల్ ఫొటో కనిపించేలా మరిన్ని కొత్త ఆప్షన్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని