YouTube: యూట్యూబ్‌ యాప్‌లోనూ క్యూ కట్టొచ్చు!

డెస్క్‌టాప్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో యూట్యూబ్‌ చూస్తున్నప్పుడు ఒక వీడియో అయిపోగానే మరో వీడియో మొదలు కావటం చూసే ఉంటారు.

Updated : 28 Dec 2022 12:44 IST

డెస్క్‌టాప్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో యూట్యూబ్‌ చూస్తున్నప్పుడు ఒక వీడియో అయిపోగానే మరో వీడియో మొదలు కావటం చూసే ఉంటారు. ఇది త్వరలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలకూ వర్తించనుంది. ఇందుకోసం యూట్యూబ్‌ కొత్తగా క్యూ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే దీన్ని పరీక్షించటం ఆరంభించారు. ఈ ఫీచర్‌ను ఒకసారి ఎనేబుల్‌ చేసుకుంటే చాలు. వీడియో థంబ్‌నెయిల్స్‌ మీదుండే నిలువు మూడు చుక్కల మెనూలో ‘ప్లే లాస్ట్‌ ఇన్‌ క్యూ’ బటన్‌ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్‌ చేసి.. వీడియో జాబితాల దిగువన మరో వీడియోను జత చేసుకోవచ్చు. కొత్త వీడియోల వరుసనూ సృష్టించుకోవచ్చు. ఇవి వరుసగా ఒక దాని తర్వాత మరోటి ప్లే అవుతూనే వస్తాయి. ప్రొఫైల్‌ పిక్చర్‌ ద్వారా సెటింగ్స్‌ లోకి దీన్ని ఎనేబుల్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని