జగన్‌ అవినీతిని సాక్ష్యాలతో నిరూపిస్తాం

ఏపీలో సంక్షేమం పేరుతో మోసం జరుగుతోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. గోరంత ఇస్తూ కొండంత దోచేస్తూ సాగిన రెండేళ్ల పాలనలో సీఎం జగన్‌ హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని ...

Updated : 23 Jun 2021 14:02 IST

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీలో సంక్షేమం పేరుతో మోసం జరుగుతోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. గోరంత ఇస్తూ కొండంత దోచేస్తూ సాగిన రెండేళ్ల పాలనలో సీఎం జగన్‌ హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. జగన్‌ తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు తెదేపా క్షేత్ర స్థాయి పోరాటాలకు సిద్ధమవుతోందని ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఆయన మంగళవారం ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ‘అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం లేక రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగారు. జాబ్‌ క్యాలెండరు పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండరును విడుదల చేశారు. ఏటా రూ.లక్షల ఖర్చుతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న లక్షలాది నిరుద్యోగ యువతను రోడ్డున పడేశారు. గ్రూప్‌-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయి. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విషయంలోనూ జగన్‌ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు.  లబ్ధిదారుల ఎంపికలో కోత విధించి చేయూత పథకం పేరుతో మహిళలను జగన్‌ మోసగించారని మండిపడ్డారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సిన్ల పంపిణీలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు దుయ్యబట్టారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని