25 నుంచి వామపక్షపార్టీల ఆందోళనలు

నిత్యావసర ధరలు, భూముల రిజిస్ట్రేషన్‌, విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. బుధవారం హైదరాబాద్‌లోని

Published : 19 May 2022 05:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిత్యావసర ధరలు, భూముల రిజిస్ట్రేషన్‌, విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27న మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 30న జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు, 31న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని