ధనార్జనే తెరాస ధ్యేయం: ప్రవీణ్‌కుమార్‌

ధనార్జనే తెరాస ధ్యేయమని, అధికారంలో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త

Published : 21 May 2022 05:13 IST

నర్సింహులపేట, న్యూస్‌టుడే: ధనార్జనే తెరాస ధ్యేయమని, అధికారంలో ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం కేంద్రంతోపాటు జయపురం గ్రామంలో పర్యటించి మాట్లాడారు. అర్హులకు ఆసరా పింఛన్లు, ఇళ్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, పాఠ్యపుస్తకాలు అందించలేని కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్థిక సాయం చేయడానికి వెళ్తుండడం విడ్డూరమన్నారు. ముందు రాష్ట్రాన్ని చక్కదిద్దుకుని ఆ తర్వాత బయటి రాజకీయాల గురించి మాట్లాడాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. జయపురం గ్రామ శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నా.. వాటిని అర్హులకు ఎందుకు పంపిణీ చేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలకు సొంతింటి కోసం రూ.3 లక్షలు ఇస్తామంటూ కేసీఆర్‌ మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని, ప్రజలు అలాంటి హామీలను నమ్మవద్దు అని ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని