గ్రామ పాలనను వికేంద్రీకరించిన ఘనత రాజీవ్‌దే

గ్రామ పంచాయతీల స్థాయిలో పరిపాలనను వికేంద్రీకరించిన ఘనత రాజీవ్‌గాంధీదేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్‌గాంధీ 31వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం

Published : 22 May 2022 05:14 IST

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల స్థాయిలో పరిపాలనను వికేంద్రీకరించిన ఘనత రాజీవ్‌గాంధీదేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్‌గాంధీ 31వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం గాంధీభవన్‌లో నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సమస్యలు వదిలి సీఎం కేసీఆర్‌ దేశ పర్యటనా.. అది వ్యక్తిగతమే అయినప్పటికీ రాష్ట్రంలో రైతులు నకిలీ విత్తనాలు, రుణాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటికి పరిష్కారం చూపి పర్యటన చేస్తే బాగుండేది. కేంద్రం నేరుగా పంచాయతీలకు నిధులిస్తే తప్పేమిటి. స్వాతంత్య్ర పోరాటంలో గ్రామ స్వరాజ్యం అతి ముఖ్యమైనది. అందుకే రాజ్యాంగానికి 73, 74 సవరణలు వచ్చాయి. రాజీవ్‌ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారు. ప్రపంచంలో గొప్ప సంస్థలకు మనవాళ్లు సీఈవోలుగా ఉన్నారంటే అందుకు ఆయన వేసిన బాటలే దోహదం చేశాయి. జాతి సమైక్యత కోసం రాజీవ్‌గాంధీ దేశం మొత్తం సద్భావన యాత్ర చేశారు. భారత్‌ జోడో నినాదంతో మరోసారి కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్లనుంది’’ అని భట్టి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని