TS News: రేషన్‌ బియ్యం కోటాలో కోత

రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి అయిదు కిలోలే ఉచితంగా ఇవ్వాలంటూ......

Published : 03 Jul 2021 07:37 IST

జులైలో మనిషికి ఐదు కిలోలే

ఈనాడు, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ పరిపాలనా ప్రాంగణం: రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి అయిదు కిలోలే ఉచితంగా ఇవ్వాలంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా రెండో దశ తీవ్రత నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కార్డుదారు కుటుంబంలోని ఒక్కొక్కరికీ అయిదు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి మరో అయిదు కిలోలు కలిపి అందిస్తామని పేర్కొంది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి మొత్తం ఒక్కొక్కరికి 30 కిలోలు ఇవ్వాలి. ఇప్పటికి 25 కిలోలే అందాయి. ఇంకా 5 కిలోల బకాయి ఉంది. కరోనా తీవ్రత తగ్గుతున్నప్పటికీ దీపావళి పండుగ వరకు ఉచితంగా బియ్యం పంపిణీని కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ ప్రకారం జులైలో బకాయి 5 కిలోలు, కేంద్ర, రాష్ట్ర కోటాలు కలిపితే ఒక్కొక్కరికి 15 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది.ఒక్కొక్కరికి అయిదు కిలోలు మాత్రమే ఉచితంగా ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా ఆదేశాలు జారీ చేయటంలోని ఆంతర్యం అంతుచిక్కక క్షేత్రస్థాయి అధికారులు అయోమయంలో పడ్డారు. కార్డుదారుల సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ లేదా ఐరిస్‌ ద్వారా రేషన్‌ పంపిణీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నెల అయిదు నుంచి 15లోగా పంపిణీ క్రతువును పూర్తి చేయాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు