కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలి

ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో భారీ ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని

Published : 04 Dec 2021 05:17 IST

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో భారీ ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీని శుక్రవారం ట్విటర్‌ ద్వారా కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం, కర్ణాటకలోని ఎగువభద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలంగాణ ప్రాజెక్టులకూ ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రిని పలుమార్లు కోరినట్లు తెలిపారు. ఈ నెల ఆరో తేదీన జరిగే సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి నిర్వాహక (స్టీరింగు) కమిటీని ఆదేశించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని