
Published : 22 Jan 2022 05:21 IST
అదో చెరువంట.. అందులో పతంగుల పూలపంట
విశాలమైన చెరువు.. దట్టంగా అలుముకున్న గుర్రపుడెక్క.. నడుమ వికసించిన విభిన్న వర్ణాల పూలు.. ఆహా! ఎంత బాగుందీ దృశ్యం!.. అనుకుంటే మనం కొలనులో కాలేసినట్టే.. ఇవి పూలు కానే కాదు.. తెగిపడిన రంగురంగుల గాలిపటాలు. సంక్రాంతి పండక్కి ఆబాలగోపాలం సంబరంగా ఎగరేసిన పతంగులు అంబరాన్ని తాకి ఆపై తెగిపడి ఇలా చెరువులో చిక్కుకున్నాయి. దూరం నుంచి చూసేవారికి రంగురంగుల పూలలా భ్రమింపజేస్తున్నాయి. గోల్కొండ కోట సమీపంలో లంగర్ హౌస్ చెరువులో ఈనాడు కెమెరా కంటికి చిక్కిందీ చిత్రం.
Advertisement
Tags :