బాధితులకు గవర్నర్‌ పరామర్శ

వైద్యులు పట్టించుకోకపోవడంతో కరోనా సోకిన నిండు గర్భిణి  నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రి గేటు వద్ద ఈ నెల 25న ప్రసవించిన దయనీయ పరిస్థితిపై గవర్నర్‌ తమిళిసై గురువారం స్పందించారు. బాధిత కుటుంబ సభ్యుడు

Published : 28 Jan 2022 04:34 IST

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: వైద్యులు పట్టించుకోకపోవడంతో కరోనా సోకిన నిండు గర్భిణి  నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రి గేటు వద్ద ఈ నెల 25న ప్రసవించిన దయనీయ పరిస్థితిపై గవర్నర్‌ తమిళిసై గురువారం స్పందించారు. బాధిత కుటుంబ సభ్యుడు సాలయ్యకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. వైద్యులు కేవలం చెంచులను మాత్రమే పట్టించుకోవడం లేదని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు బల్మూరు మండలంలోని బాణాలకు వెళ్లిన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.శివరాం, ఫార్మసిస్టు రాజేశ్‌ తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి కేసీఆర్‌ కిట్‌ను అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని