Samatha Murthy: సమతామూర్తి దర్శనం రోజుకు 4 గంటలే

సాధారణ ప్రవేశ రుసుముతో బుధవారం నుంచి రోజుకు నాలుగు గంటల పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ సమతామూర్తి కేంద్రంలో దర్శనాలకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు అనుమతి ఉంటుంది.

Updated : 16 Feb 2022 08:34 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: సాధారణ ప్రవేశ రుసుముతో బుధవారం నుంచి రోజుకు నాలుగు గంటల పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ సమతామూర్తి కేంద్రంలో దర్శనాలకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు అనుమతి ఉంటుంది. జీవాశ్రమం నిర్వహకులు ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ నెల 19న 108 దివ్య దేశ భగవన్మూర్తుల కల్యాణమహోత్సవ క్రతువు పూర్తయ్యే వరకు సువర్ణమూర్తి దర్శనం, త్రీడి షోలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని