TS High Court: స్త్రీ పురుషులకు ఒకే శారీరక ప్రమాణాలా?

సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఏఈఎస్‌) పదోన్నతులకు సంబంధించి స్త్రీ పురుషులకు శారీరక ప్రమాణాలు ఒకేలా నిర్ణయించడం వివక్షాపూరితమేనని హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. జాతీయ పోటీ పరీక్షలు, సైన్యంలో ఎంపికలకు కూడా స్త్రీ పురుషులకు వేర్వేరు ప్రమాణాలను నిర్దేశిస్తున్నారని ప్రస్తావించింది

Updated : 19 Feb 2022 10:28 IST

అది వివక్షాపూరితమే ఏఈఎస్‌ పదోన్నతులపై హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఏఈఎస్‌) పదోన్నతులకు సంబంధించి స్త్రీ పురుషులకు శారీరక ప్రమాణాలు ఒకేలా నిర్ణయించడం వివక్షాపూరితమేనని హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. జాతీయ పోటీ పరీక్షలు, సైన్యంలో ఎంపికలకు కూడా స్త్రీ పురుషులకు వేర్వేరు ప్రమాణాలను నిర్దేశిస్తున్నారని ప్రస్తావించింది. కానీ తెలంగాణలో పురుషులతో సమానంగా మహిళల ఎత్తు ఉండాలనడం సరికాదంది. ఎక్సైజ్‌ శాఖలో అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న రమ్యకుమారి తన ఎత్తు నిబంధనల ప్రకారం లేనందున తనకు ఏఈఎస్‌ పదోన్నతి నిరాకరించారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ ఎక్సైజ్‌ శాఖలో చేరినప్పుడు 155 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నారన్నారు. ప్రభుత్వం ఏఈఎస్‌ పోస్టులకు 165 సెంటీమీటర్ల ఎత్తును అర్హతగా నిర్ణయించిందన్నారు. ఈ కారణంగా ఆమె పదోన్నతి అవకాశం కోల్పోతున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పదోన్నతిలో పిటిషనర్‌ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని