Telangana News: ఎమ్మెల్యే సోదరుడికి దళితబంధు!

దళితబంధు పథకం అమలులో కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్ధిదారుల జాబితాలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే,

Updated : 29 Mar 2022 06:47 IST

ఈనాడు, వరంగల్‌: దళితబంధు పథకం అమలులో కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్ధిదారుల జాబితాలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సోదరుడు, ఘన్‌పూర్‌ సర్పంచి సురేశ్‌కుమార్‌ పేరు ఉండడం గమనార్హం. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా..దళితబంధు పథకంలో ఎస్సీల్లో పేదలకే ఇవ్వాలనే నిబంధన లేదని, ప్రభుత్వ ఉద్యోగులు కాని 60 ఏళ్ల లోపు వారు అంతా అర్హులేనని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని