ఈహెచ్‌ఎస్‌కు కేటాయింపులపై హర్షం

ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి ఒకశాతం చందా వసూలు చేసి అంతే మొత్తాన్ని ప్రభుత్వం జత చేసి నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు రూ.700 కోట్ల మేరకు బడ్జెట్‌ను కేటాయించడంపై రాష్ట్ర ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.

Published : 07 Feb 2023 07:22 IST

టీజీవో, టీఎన్జీవో కార్యాలయాల్లో సంబురాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి ఒకశాతం చందా వసూలు చేసి అంతే మొత్తాన్ని ప్రభుత్వం జత చేసి నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు రూ.700 కోట్ల మేరకు బడ్జెట్‌ను కేటాయించడంపై రాష్ట్ర ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. టీజీవో, టీఎన్జీవో కార్యాలయాల్లో నిర్వహించిన సంబురాల్లో ఆ సంఘాల అధ్యక్షులు మమత, మామిళ్ల రాజేందర్, నేతలు సత్యనారాయణ, రాయకంటి ప్రతాప్, వెంకటేశ్వర్లు, కృష్ణయాదవ్, జగన్మోహన్, కస్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంలో రాష్ట్రంలోని 6.50 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదార్లు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. తాము పలుమార్లు విజ్ఞప్తి చేసిన మేరకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 2.88 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విశ్వాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు