మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో సాంకేతిక అద్భుతం

దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం(ఓఎస్‌) శ్రేణిలో తదుపరి ఆవిష్కరణను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించే

Updated : 25 Jun 2021 12:34 IST

విండోస్‌ 11 ఓఎస్‌ ఆవిష్కరణ
ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి

రెడ్‌మాండ్‌: దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం(ఓఎస్‌) శ్రేణిలో తదుపరి ఆవిష్కరణను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించే సరికొత్త సదుపాయాలతో విండోస్‌ 11 ఓఎస్‌ను గురువారం వర్చువల్‌ విధానంలో ఆవిష్కరించింది. 2015లో విండోస్‌ 10ను విడుదల చేసిన తరువాత మైక్రోసాఫ్ట్‌ నుంచి వచ్చిన కీలక ఆవిష్కరణ ఇదే. ‘‘వచ్చే పదేళ్ల వరకూ వినియోగదారుల అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందిస్తున్నాం. విండోస్‌ చరిత్రలో ఇదో పెద్ద మైలు రాయి’’ అని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు. విండోస్‌ 11లో స్టార్ట్‌ మెనూ కొత్తగా ఉండబోతోంది. టాస్క్‌బార్‌, ఫాంట్‌, ఐకాన్‌ల విషయంలోనూ సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ ఓఎస్‌ ద్వారా తొలిసారిగా విండోస్‌.. ఆండ్రాయిడ్‌ యాప్‌లను కూడా వినియోగించుకునే సదుపాయం అందించబోతోంది. ఈ ఏడాది చివరికల్లా కొత్త కంప్యూటర్లతో పాటు విండోస్‌ 10 వినియోగదారులకూ కొత్త ఓఎస్‌ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని