ఏఈవోలకు 17 రకాల పనులు

వ్యవసాయశాఖాధికారులు ఇక నుంచి రైతులకు మరింత చేరువ కానున్నారు. ప్రతి 5 వేల మంది రైతులకు ఒక రైతు వేదిక నిర్మించి, విస్తరణాధికారిని నియమించిన క్రమంలో వ్యవసాయశాఖ వీరికి 17 రకాల బాధ్యతలు అప్పగించి రోజుకో పనిచేయాలని ఆదేశించింది.

Published : 06 Jul 2022 05:41 IST

దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: వ్యవసాయశాఖాధికారులు ఇక నుంచి రైతులకు మరింత చేరువ కానున్నారు. ప్రతి 5 వేల మంది రైతులకు ఒక రైతు వేదిక నిర్మించి, విస్తరణాధికారిని నియమించిన క్రమంలో వ్యవసాయశాఖ వీరికి 17 రకాల బాధ్యతలు అప్పగించి రోజుకో పనిచేయాలని ఆదేశించింది. వాటిని ఎప్పటికప్పుడు ‘ఏఈవో యాక్టివేట్‌ లాగర్‌’’ అనే యాప్‌లో నమోదు చేయాలంది.

పనుల వివరాలివీ...

1.రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాలు 2.క్రాప్‌ బుకింగ్‌ 3.రైతు బీమా క్లెయిం 4.విత్తనాల పంపిణీ 5.కొనుగోలు కేంద్రాల సందర్శన 6.భూసార పరీక్షలకు మట్టి నమూనాల సేకరణ 7.పంటకోత ప్రయోగాల వివరాలు 8.సమావేశాల నిర్వహణ 9.ప్రదర్శన క్షేత్రాల సందర్శన 10.రైతుబంధులో తేడాలుంటే సరిచేయడం 11.పీఎం కిసాన్‌ జమలో రైతుల ఇబ్బందులు 12.రైతు వేదికల్లో నిర్వహించే శిక్షణ శిబిరాలు 13.ఇన్‌పుట్స్‌ సరఫరా 14.రైతువేదికలోని పన్నెండు రకాల రిజిస్టర్ల అప్‌డేషన్‌ 15.రైతుల పంటల సందర్శన 16.రైతులతో ముఖాముఖి వారి సమస్యల నమోదు  17. వివిధ అంశాలపై రైతులతో కలిసి సందర్శన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని