పీజీ వైద్యవిద్య ప్రవేశాలు ప్రారంభం

పీజీ వైద్య విద్య ప్రవేశ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. నిమ్స్‌ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన విడుదల చేసింది.

Updated : 05 Oct 2022 05:54 IST

6 వరకూ వెబ్‌ఆప్షన్లు
నేటి నుంచి పీజీ యాజమాన్య కోటా ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ వైద్య విద్య ప్రవేశ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. నిమ్స్‌ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 6న ఉదయం 11 గంటల్లోగా కళాశాలల వారీగా ప్రాధాన్యత క్రమంలో వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా పీజీ వైద్య విద్య సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య వర్సిటీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5న ఉదయం 8 నుంచి 12న సాయంత్రం 5 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం ప్రశ్నపత్రం లీక్‌ కాలేదు

ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం ప్రశ్నపత్రం ముందస్తుగా బయటకు వెల్లడైందని కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాళోజీ వర్సిటీ పరీక్షల కంట్రోలర్‌ మల్లేశ్వర్‌ తెలిపారు. లీక్‌ అయినట్లు ఆధారాలుంటే విశ్వవిద్యాలయానికి సమర్పించాలని పేర్కొన్నారు.

211 అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతి

రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌, బీఈడీ కళాశాలల్లో 211 మంది అతిథి అధ్యాపకుల నియామకానికి పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అధ్యాపకుల నియామకానికి జులై 27న ఆర్థికశాఖ ఆమోదం తెలపగా రెండు నెలల తర్వాత పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts