ఇంటాక్‌ క్విజ్‌ పోటీల్లో మెరిసిన కోదాడ విద్యార్థులు

రాష్ట్ర స్థాయిలో శుక్రవారం హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ వస్తు సంగ్రహాలయం (మ్యూజియం)లో నిర్వహించిన ఇంటాక్‌ హెరిటేజ్‌ క్విజ్‌-2022 తుది పోటీల్లో సూర్యాపేట జిల్లా కోదాడ తేజ విద్యాలయ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.

Updated : 26 Nov 2022 05:04 IST

కోదాడ పట్టణం, చార్మినార్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయిలో శుక్రవారం హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ వస్తు సంగ్రహాలయం (మ్యూజియం)లో నిర్వహించిన ఇంటాక్‌ హెరిటేజ్‌ క్విజ్‌-2022 తుది పోటీల్లో సూర్యాపేట జిల్లా కోదాడ తేజ విద్యాలయ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు భారతీయ కళలు, చరిత్ర, సంస్కృతిపై అవగాహన కల్పించడానికి ఈ పోటీలు ఏటా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. వీటిని ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ఫర్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వందకుపైగా పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీల్లో కోదాడ తేజవిద్యాలయ పదోతరగతి విద్యార్థులు తిప్పన అభిరామిరెడ్డి, రావులపెంట జశ్వంత్‌ విజేతలుగా నిలిచారు. హైదరాబాద్‌ గీతాంజలి దేవశాల విద్యార్థులు ద్వితీయ స్ధానం సాధించారు. వీరికి ఇంటాక్ట్‌ రాష్ట్ర కన్వీనర్‌ అనురాధారెడ్డి, సాలార్‌జంగ్‌ మ్యూజియం డైరెక్టర్‌ నాగేందర్‌రెడ్డి జ్ఞాపికలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని